కొత్త బంగారులోకం అనే కొత్త కథతో శ్రీకాంత్ అడ్డాల 2008లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. కాలేజీలో చేరే విద్యార్థులు ఏ విధంగా ప్రవర్తిస్తారు, వారి తల్లిదండ్రులు వారి కోసం ఏ విధంగా కష్టపడతారు అనేది బేస్ చేసుకుని సరికొత్త లవ్ కథతో అందరినీ మెస్మరైజ్ చేశారు అడ్డాల. కొత్తగా కాలేజీలో చేరిన కుర్రాళ్ళు తొలి పరిచయంలోనే ప్రేమ మైకంలోనే కొన్నాళ్లు గడిపి , చివరికి వారు అనుకున్న గోల్స్ సాధించాక మళ్లీ కలుసుకునే చిత్రం ఈ కొత్త బంగారులోకం. ఈ సినిమాతో శ్రీకాంత్ అడ్డాల కుర్ర కారును నిజంగా ఒక కొత్త బంగారు లోకానికి తీసుకెళ్లారని చెప్పవచ్చు.
Advertisement
also read:Telangana: తెలంగాణకు మరో సెంట్రల్ మినిస్టర్ పదవి.. ఆ ఎంపికే ఛాన్స్ ఉందా..?
Advertisement
అంతటి బేస్ ఉన్న కథతో తెరకెక్కిన ఈ మూవీకీ మిక్కీ జే మేయర్ సంగీతం హైలెట్ గా నిలిచాయని చెప్పవచ్చు. ఆయన పాటల లోనే ప్రేమను బాధను ఆనందాన్ని కలగలిపి ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు. ఇన్ని అద్భుత హంగులు ఉన్న ఈ మూవీలో ఆ ఒక్క మిస్టేక్ తో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దొరికిపోయారు.. దీంతో నెటిజన్స్ అంతా అంత చిన్న లాజిక్ ను ఎలా మిస్ అయ్యారు శ్రీకాంత్ అడ్డాల అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ లాజిక్ ఏంటయ్యా అంటే..
ఈ సినిమాలో వరుణ్ సందేశ్ చదివింది బైపీసీ గ్రూప్. ల్యాబ్ లో ప్రయోగాలు చేస్తూ కూడా కనిపిస్తాడు. కానీ క్లైమాక్స్ లో మాత్రం వరుణ్ సందేశ్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నట్లు చూపిస్తారు. ఇది సినిమాలో జరిగిన బిగ్ మిస్టేక్. దీనిని గుర్తించిన నెటిజెన్లు బైపీసీ చదివి ఇంజనీరింగ్ అవ్వడం మామూలు విషయం కాదు అంటూ తమదైన శైలిలో డైరెక్టర్ కు కామెడీ కౌంటర్లు ఇస్తున్నారు. అంతటి సినిమా తీసి ఇంత చిన్న చిన్న లాజిక్ లు ఎలా మర్చిపోతారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరి ఈ మిస్టేక్ పై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి..
also read: