Home » ఫిఫా ప్రపంచ కప్ లో విజేత ఎవరు ? అర్జెంటీనా విజేతగా నిలిస్తే నమోదు కానున్న 6 రికార్డులు ఇవే.. !

ఫిఫా ప్రపంచ కప్ లో విజేత ఎవరు ? అర్జెంటీనా విజేతగా నిలిస్తే నమోదు కానున్న 6 రికార్డులు ఇవే.. !

by Anji
Ad

దాదాపు నెల రోజులుగా ప్రపంచంలోని అత్యంత ప్రజాదారణపొందిన ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే ఖతార్ లోని లుసైల్ స్టేడియంలో హోరాహోరీ మ్యాచ్ జరుగనుంది. ఇక ఈ యుద్ధంలో ఇద్దరూ సూపర్ స్టార్లు ముఖాముఖిగా పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఒకరు గొప్ప ఆటగాడిగా స్థిర పడగా.. మరొకరు గొప్పతనం గురించి ఎదుగుతున్న యువస్టార్ ఆటగాడు. 60 ఏళ్ల కిందట బ్రెజిల్ చేసిన పనిని డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ చేయగలదా ? అర్జెంటీనా 36 ఏళ్ల నిరీక్షణకు తెరపడనుందా ? వంటి విషయాలు మరికొద్ది గంటల్లోనే తేలనున్నాయి. 

Advertisement

ముఖ్యంగా లియోనెల్ మెస్సీ, కైలిన్ ఎంబాప్పే వీరిద్దరిలో ఎవరు చరిత్రను మార్చనున్నారు ? ఒక వేళ అర్జెంటీనా ప్రపంచ ఛాంపియన్ గా నిలిస్తే మాత్రం చరిత్రలో నమోదైన 6 రికార్డులు మారిపోతాయి. అర్జెంటీనా గతంలో 1978, 1986లో రెండుసార్లు ఫుట్ బాల్ ప్రపంచ కప్ గెలుచుకుంది. ఆ తరువాత ఈ టైటిల్ కోసం పోరాడింది. కానీ చాలా సార్లు ట్రోపీ దగ్గరికి వచ్చి దూరం అయింది. 1990లో కూడా అర్జెంటీనా వరుసగా రెండోసారి ఫైనల్ కి చేరినప్పటికీ రన్నరప్ తోనే సరిపెట్టుకుంది. 2014లో కూడా అర్జెంటీనా ఫైనల్ లో ఓడినప్పటికీ మరోసారి చరిత్ర మార్చేసే అవకాశం అయితే లభించింది.  

Also Read :  వారసుడు సినిమాని విజయ్ కంటే ముందు మహేష్, రాంచరణ్ ఎందుకు వద్దన్నారు? 

Advertisement

  1. 1986 నుంచి అర్జెంటీనా ఎప్పుడూ ప్రపంచ ఛాంపియన్ గా నిలవలేకపోయింది. 36 ఏళ్ల తరువాత అర్జెంటీనా ప్రపంచ ఛాంపియన్ గా అవతరిస్తే చరిత్రలో నమోదైన ఈ రికార్డు మారనుంది. 
  2. లియోనెల్ మెస్సీ ఎప్పుడూ ప్రపంచ కప్ గెలవలేదు. చరిత్రలో నమోదైన మెస్సీ పేరిట ఉన్న ఈ బాధకరమైన రికార్డు కూడా మారిపోతుంది. మెస్సీ మొదటిసారి ప్రపంచ ఛాంపియన్ గా అవతరిస్తాడు. దీంతో అతను రెండు ప్రపంచ కప్ గెలిచిన అర్జెంటీనా కెప్టెన్లు డేనియల్ పసరెల్లా, డిగో మరోదానా క్లబ్ లో చేరనున్నాడు 
  3. అర్జెంటీనా ప్రపంచ కప్ ని మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు గెలుచుకున్న నాలుగో జట్టుకు అవతరిస్తుంది. బ్రెజిల్ అత్యధికంగా 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. జర్మనీ, ఇటలీ వంటి జట్లు 4-4 సార్లు ఛాంపియన్ గా నిలిచాయి. 
  4. అర్జెంటీనా కూడా యూరప్ ఆధిపత్యానికి తెరపడనుంది. 2002లో బ్రెజిల్ ఛాంపియన్ గా నిలిచిన తరువాత ప్రపంచ కప్ ను గెలుచుకున్న తొలి దక్షిణ అమెరికా జట్టుగా అవతరిస్తుంది. 
  5. గత నాలుగు ప్రపంచ కప్ లను ఐరోపా దేశాలు గెలుచుకుంటే.. 2006లో ఇటలీ, 2010లో స్పెయిన్, 2014లో జర్మనీ, 2018లో ఫ్రాన్స్ ఛాంపియన్ గా నిలిచాయి. 
  6. అర్జెంటీనా విజయంతో ఫ్రాన్స్ చరిత్రలో రెండోసారి రన్నరప్ గా అవతరిస్తుంది. అంతకుముందు ఫ్రాన్స్ 2006లో రన్నరప్ గా నిలిచింది. 

 Also Read :  నోబాల్ కూడా కాదు.. శ్రేయస్ అయ్యర్ క్లీన్ బౌల్డ్ అయినా అంపైర్ ఔట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి ? 

Visitors Are Also Reading