తమిళ స్టార్ హీరో విజయ్ దళపతితో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు, వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారసుడు’ జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా టాలీవుడ్ లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ వెర్షన్ లలో ఒకేసారి విడుదల చేస్తున్నారు. అంతకు ఒక రోజు ముందు అమిళంలో అజిత్ నటించిన తునివు సినిమా కూడా విడుదలవుతోంది. తమిళంలో అజిత్ తునివుతో పోటీపడుతుంది విజయ్ వరిసు. తెలుగులో బాలయ్య నటించిన వీరసింహారెడ్డి, వారసుడు ఒకే రోజు విడుదలవుతున్నాయి.
Advertisement
అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారసుడు సినిమాకి సంబంధించి థియేటర్ల విషయంలో వివాదాలు తలెత్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళంలో కూడా అది పరిస్థితి నెలకొన్నట్టు సమాచారం. ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు తమిళంలో ఉన్నటువంటి 800 స్క్రీన్ లలో 400 తునివు, 400 వరిసు చిత్రాలు విడదలవుతున్నట్టు చెప్పారు. అయితే వరిసుకు అదనంగా మరో 50 స్క్రీన్ లు కావాలని అడగడం కోసం తాను స్వయంగా చెన్నై వెళ్లనున్నట్టు దిల్ రాజు చెప్పుకొచ్చారు.
Advertisement
ఇదే సమయంలో వారసుడు సినిమాను తెలుగు హీరోలతో తెరకెక్కించకుండా తమిళ హీరో అయినటువంటి విజయ్ దళపతితో తెరకెక్కించడానికి కారణం ఏంటని ఓ యాంకర్ ప్రశ్నించగా.. వాస్తవానికి మహేష్ బాబుతో మహర్షి సినిమాను తెరకెక్కించిన వంశీ పైడిపల్లి వారసుడు చిత్రాన్ని తొలుత మహేష్ బాబుతోనే తెరకెక్కించనున్నట్టు వార్తలు వినిపించాయి. అప్పటికే మహేష్ బాబు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తరువాత రాజమౌళితో సినిమా చేసేందుకు కమిట్ మెంట్ ఇచ్చారు. అందుకే మహేష్ ఈ సినిమా చేయలేదని ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు. అదేవిధంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా ఈ సినిమా కథను వినిపించాం. చరణ్ వంశీ కథ కంటే ముందే శంకర్ కథ నచ్చడంతో చివరికీ అది విజయ్ వద్దకు వెళ్లిందని దిల్ రాజు వెల్లడించారు. తెలుగులో అగ్ర హీరోలకు పోటీగా వస్తున్న వారసుడు చిత్రం విజయాన్ని సాధిస్తుందో లేదో వేచి చూడాలి మరి.
Alao Read : ఎట్టకేలకు సినిమా షూటింగ్ సెట్స్ కి హాజరైన అనుష్క శెట్టి.. !