తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా మరియు హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆలీ. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కొన్ని రకాల షోలు చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆలీతో సరదాగా షో మాత్రం ఆయనకు మరింత గుర్తింపును అందించింది అని చెప్పవచ్చు. ఆలీ తెలుగు ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ చేసిన సినిమాల ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యాడు.
Advertisement
ఇక ఇటీవల వైసిపి పార్టీలో ఎప్పటినుంచో యాక్టివ్ గా ఉంటున్న కమెడియన్ ఆలీకి కీలక పదవిని అందించారు జగన్మోహన్ రెడ్డి. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఆలిని నియమించినట్లు జగన్ అధికారికంగా ప్రకటించారు. ఇక తనకు జగన్ అప్పజెప్పిన పనులను నియమ నిబంధనలతో నిర్వర్తిస్తానని ఆలీ ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా, ఆలీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన గుంటూరు తూర్పు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
Advertisement
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్నారు. అందుకే ఏ పార్టీ అయినా, మైనార్టీలకే టికెట్ ఇస్తూ వస్తోంది. వాస్తవానికి ఒకప్పుడు గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉండేది. రెండుసార్లు ఎస్ఎం జియావుద్దీన్ గెలుపొందారు. కానీ, 2004లో ఈ నియోజకవర్గంలో టిడిపి పట్టు కోల్పోయింది. 2014లో వైసిపి నుంచి పోటీ చేసిన షేక్ మహమ్మద్ ముస్తఫా గెలుపొందారు. 2019 లోను షేక్ మహమ్మద్ ముస్తఫానే విజయం సాధించారు. 2024 లోను వైసీపీ నుంచి ఎవరు పోటీ చేసిన గెలుస్తారనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో, ఆలీ అక్కడి నుంచే పోటీ చేయడానికి మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.
READ ALSO : తెలంగాణ యూట్యూబర్ ‘శ్రీ’ పెళ్లి.. సబ్స్క్రైబర్స్ నుంచి రూ.4 కోట్ల కట్నాలు!