Home » అవతార్ 2 సినిమాలోని ప్లస్ లు…. మైనస్ లు ఇవే….!

అవతార్ 2 సినిమాలోని ప్లస్ లు…. మైనస్ లు ఇవే….!

by AJAY
Ad

ప్రపంచంలోనే భారీ చిత్రం అవతార్ 2 నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జేమ్స్ కెమెరాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జేమ్స్ కెమెరాన్ దర్శకత్వంలో వచ్చిన టైటానిక్ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్లీ జేమ్స్ కెమెరాన్ అవతార్ 2 తో అద్భుత ప్రపంచాన్ని సృష్టించాడు. అవతార్ పార్ట్ 1 కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అవతార్ పార్ట్ 1 లో ఒక మనిషి అవతార్ గా ఎలా మారాడు…? నేవీలకు ఎలా నాయకుడు అయ్యాడు..?

Advertisement

మనుషుల నుండి నేవీలో తెగను ఎలా రక్షించాడు అన్నదాన్ని చూపించాడు. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా అవతార్ పార్ట్ 2 ను తెరకెక్కించాడు. ఈ సినిమా విజువల్ వండర్ గా డిసెంబర్ 16న న విడుదలైంది. అయితే అవతార్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం కాగా పార్ట్ 2 కు మాత్రం మిక్స్డ్ టాక్ వస్తోంది. పార్ట్ 2 కి మిక్స్డ్ టాక్ ఎందుకు వస్తుంది సినిమాలోని ప్లస్ లు ఏంటి..? మైనస్ లు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం…

Advertisement

సినిమాలోని ప్లస్ ల విషయానికి వస్తే సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు హాలీవుడ్ లో సైతం ఇలాంటి విజువల్ వండర్ సినిమా రాలేదని చెప్పాలి. సినిమాలో ప్రతి సన్నివేశం 3d ఎఫెక్ట్స్ తో ప్రేక్షకులను మైమరిపించింది. అంతేకాకుండా మూడు గంటల సినిమా అయినప్పటికీ దర్శకుడు సినిమాలో ఎక్కడా లాజిక్ లు మాత్రం మిస్ కానిలేదు. జేమ్స్ కెమెరాన్ తాను చెప్పాలనుకున్న విషయాన్ని ప్రేక్షకుడికి కచ్చితంగా చెప్పగలిగాడు. అయితే అవతార్ పార్ట్ 2 లో కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయి. అవతార్ పార్ట్ 1 లో ఒక మనిషి అవతార్ గా ఎలా మారుతాడు. ఆ తర్వాత నేవీతో ఎలా ప్రేమలో పడతాడు… వాళ్ళిద్దరి మధ్య ప్రేమ, ఎమోషన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా అవతార్ సినిమా పార్ట్ 1 కు కథ ప్రాణం పోసింది. ఆ కథకు గ్రాఫిక్స్ తోడవడంతో విజువల్ వండర్ గా నిలిచింది. కానీ పార్ట్ 2 లో మాత్రం కథ అతిపెద్ద మైనస్ అయ్యింది. అంతేకాకుండా సినిమా పార్ట్ వన్ లో పాత్రలు తక్కువ ఉంటాయి. కానీ అవతార్ పార్ట్ 2 లో ఎక్కువ పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చారు. పార్ట్ 2 లో పాత్రలు ఎక్కువ అవడం కూడా సినిమాకు మైనస్ అయ్యింది.

avatar 2 movie review in telugu

అంతేకాకుండా సినిమా మూడు గంటల సమయం ప్రేక్షకుడికి పరీక్ష పెట్టినట్టయింది. మొదటి అరగంట మరియు చివరి అరగంట సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. కానీ మిగతా సమయం మొత్తం ప్రేక్షకుడు బోర్ గా ఫీల్ అయ్యేలా… సాగదీత సన్నివేశాలు కనిపించాయి. మొదటి పార్ట్ నేవీలకు ప్రకృతి తో ఉన్న సంబంధాన్ని దర్శకుడు కళ్ళకు కట్టినట్టుగా చూపించగలిగాడు. కానీ సెకండ్ పార్ట్ లో మాత్రం నేవీలకు ప్రకృతితో ఉన్న ఎమోషన్స్ చూపించాడు కానీ అందులో సోల్ మాత్రం మిస్ అయ్యింది. మొత్తానికి అవతార్ 2 చూసినంత సేపు పార్ట్ వన్ చూసిన ఫీలింగ్ వస్తుంది కానీ ఎక్కడా కొత్తదనం కనిపించలేదు.

Visitors Are Also Reading