భార్యభర్తల మధ్య సాధారణంగా ఎలాంటి సీక్రెట్స్ ఉండవు. అన్ని విషయాలను భార్యభర్తలు చర్చించుకోవాలి. అయితే కొన్ని విషయాలను మాత్రం ఒకరితో మరొకరు చెప్పుకోకపోవడమే మంచిదని చాణక్యుడు తన చాణక్య నీతిలో పేర్కొన్నాడు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…సాధారణంగా ప్రతి వ్యక్తికి బలహీనతలు ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఆ బలహీనతలు ఇతరులకు చెప్పకపోవడమే మంచిది.
Advertisement
అంతే కాకుండా భర్త కూడా తనకు ఉండే బలహీనతలను భార్యకు చెప్పకపోవడమే మంచిదని చాణక్యుడు చెబుతున్నాడు. బలహీనతలు తెలిస్తే భార్య పదేపదే వాటిని ప్రస్తావిస్తూ హేళన చేసే అవకాశం ఉందని చాణక్యనీతిలో పేర్కొన్నాడు. అంతే కాకుండా తన జీవితంలో ఎదురైన అనుమానాలు కూడా జీవిత భాగస్వామితో చర్చించుకోకపోవడమే మంచిదని పేర్కొన్నాడు.
Advertisement
తమ భాగస్వామికి జరిగిన అవమానాల గురించి తెలస్తే వాళ్లు బాధపడటమే కాకుండా తమ భాగస్వామి కావడంతో ఆ అవమానం తమకే జరిగినట్టు కూడా ఫీల్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాడు. కాబట్టి జీవితంలో ఎదురైన అవమానాలను సైతం తమ పార్ట్నర్ కు చెప్పకూడదని పేర్కొన్నాడు. భర్త తన ఆదాయానికి సంబంధించిన వివరాలను కూడా భార్యకు చెప్పకూడదని చాణక్యుడు తన చాణక్యనీతిలో పేర్కొన్నాడు.
వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు…అయితే ఆదాయం గురించి చెప్పకపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయట. భర్త ఆదాయం గురించి తెలిస్తే భార్య ఖర్చులు ఎక్కువ చేయడం….అనవసరమైన ఖర్చులు చేయడం లాంటివి కూడా చేసే అవకాశం ఉందట. కాబట్టి భర్త తన ఆదాయం గురించి చెప్పకూడదని చాణక్యుడు పేర్కొన్నాడు. అంతే కాకుండా భార్య కానీ భర్త కానీ ఎవరికైనా సాయం చేయాలనుకుంటే మరొకరి తెలియకుండా చేయడం మంచిందని పేర్కొన్నాడు. చేసిన సాయం చెబితే….డబ్బు వృథా చేస్తున్నాడు అనే భావన వస్తే ఇద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని చాణక్యుడు పేర్కొన్నాడు.