భారతదేశంలో విభిన్న మతాల వారు ఉంటారు. అదేవిధంగా వారి ఆచారాలు వారి కట్టుబాట్లకు తగిన విధంగా ఉంటారు. ప్రధానంగా ఎవరికీ నచ్చిన ఆహారాన్ని వారు చాలా ఇష్టంగా తింటారు. అందులో భాగంగా కొంతమంది ఫ్రిజ్ వాటర్ తాగడానికి ఇష్టపడితే.. మరికొందరూ వేడినీటిని తాగేందుకు ఎక్కువగా మక్కువ చూపిస్పుతుంటారు. ఎక్కువగా చన్నీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కంటే కీడు ఎక్కువ చల్లని నీరు అనేక వ్యాధులను ఆహ్వానం పలుకుతాయి. చాలా మంది వైద్యులు సాధారణంగా వాటర్ తాగడం మంచిది అని చెబుతుంటారు. నీరు తాగమన్నారు కదా అని చన్నీటిని నీరు తాగకూడదు. వీలు అయితే కాచి చల్లార్చిన గోరు వెచ్చని నీటిని తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఉదయం వేళలో చాలా మందికి టీ, కాఫీల, చల్లని ఫ్రిజ్ వాటర్ ని తాగే అలవాటు ఉంటుంది. వీటికి తగిన దూరంలో ఉండడం చాలా మంచిది. ఉదయం వేళలో లేవగానే, ముఖ్యంగా చలికాలంలో ఉదయాన్నే వేడినీటిని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Advertisement
ఉదయం నిద్రలేవగానే లేదా కాలకృత్యాలు తీర్చుకోవడానికి ముందే రెండు లేదా 3 గ్లాసుల గోరు వెచ్చని నీరు తాగండి నీటిని వేగంగా తాగకుండా నోటిలోనే ఉంచుకుంటూ గుటకలు వేస్తూ తాగాలి. రోజు ఉదయం నిద్రలేవగానే వేడి నీటిని తాగడం వల్ల చాలా వరకు బరువు తగ్గుతారు. అంతేకాదు.. మీ శరరీంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజన్ లో వచ్చే వైరల్ ఇన్ ఫెక్షన్స్ నుంచి వేడి నీరు మన శరీరాన్ని రక్షిస్తుంది. అంతేకాదు.. ఉదయాన్నే వేడి నీరు తాగడం వల్ల రోజు అంతా ఉత్సాహంగా ఉంటారు. చాలా మంది బరువు తగ్గడానికి వేడి నీళ్లు తాగుతారు. ముఖ్యంగా ఉదయంతో పాటు రాత్రి సమయంలో కూడా వేడి నీటిని తాగితే ఈజీగా బరువు తగ్గుతారు.
Also Read : నటి కస్తూరి గురించి ఆశ్చర్యపోయే నిజాలు…తన సంపాదన మొత్తాన్ని ఏం చేస్తుందంటే..?
నిత్యం క్రమంతప్పకుండా వేడినీటిని తాగడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరుగుతుంది. ఊబకాయం, కొలెస్ట్రాల్ సమస్యలున్నవారు వేడినీరు తాగడం చాలా ఉత్తమం. అంతేకాదు.. వేడినీరు తాగడంతో అజీర్థి సమస్యలు తొలగిపోవడమే కాకుండా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి కడుపులో నుంచి బయటికి వచ్చే జీర్ణరసాల స్రావాన్ని వేడి నీరు పెంచుతుంది. దీని ఫలితంగా శరీరంలో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గడంతో పాటు మలబద్ధకం సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వేడినీటిని అలవాటు చేసుకొని వాటి వల్ల కలిగే ప్రయోజనాలను పొందండి.
Also Read : మాడిపోయిన గిన్నెలు తోమలేక ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేస్తే మీ పాత్రలు మెరిసిపోతాయి..!