Home » న‌టి క‌స్తూరి గురించి ఆశ్చ‌ర్య‌పోయే నిజాలు…త‌న సంపాద‌న మొత్తాన్ని ఏం చేస్తుందంటే..?

న‌టి క‌స్తూరి గురించి ఆశ్చ‌ర్య‌పోయే నిజాలు…త‌న సంపాద‌న మొత్తాన్ని ఏం చేస్తుందంటే..?

by AJAY
Ad

నటి కస్తూరి శంకర్ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఒకప్పుడు స్టార్ హీరోలకు జోడీగా నటించిన కస్తూరి ప్రస్తుతం టీవీ సీరియల్స్ లో న‌టిస్తూ మ‌రియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంది. ప్ర‌స్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో కస్తూరి తులసిగా పాత్రలో నటిస్తోంది. ఈ సీరియ‌ల్ ద్వారా కస్తూరి ప్రస్తుతం బుల్లితెర ఆడియన్స్ కు ఎంతో దగ్గర అయింది. అయితే సీరియల్ లో చాలా పద్ధతిగా కనిపిస్తున్న కస్తూరి సోష‌ల్ మీడియాలో మాత్రం గ్లామ‌రస్ ఫోటోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది.

Advertisement

ఒకప్పటి హీరోయిన్ అయినప్పటికీ ఇప్పటి కుర్ర‌ హీరోయిన్ ల‌కు సైతం పోటీ ఇచ్చే రేంజ్ లో అందాల ప్రదర్శన చేస్తుంది. అంతేకాకుండా కస్తూరి తన బోల్డ్ కామెంట్స్ తో ఎప్పుడూ వార్తల‌లో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. అయితే కస్తూరి ది ముక్కుసూటిగా మాట్లాడే తత్వం…దాంతో ఆమెని ఇష్టపడని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ కస్తూరి శంకర్ చేస్తున్న సాయం గురించి తెలిస్తే ఆమెకు సెల్యూట్ చేయకుండా ఉండలేరు.

kasthuri

Advertisement

కస్తూరి కి సొంతంగా కారు గానీ… ఏసీ టీవీ లాంటివి గానీ లేవు. ఆమె చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతోంది. అంతేకాకుండా తాను సంపాదించిన డబ్బు మొత్తం మెడికల్ హెల్త్ మరియు చైల్డ్ క్యాన్సర్ పేషెంట్ ల కోసం ఖర్చుపెడుతోంది. అయితే ఈ విషయాన్ని కస్తూరినే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. రీసెంట్ గా కస్తూరి తన ఫోన్ చెన్నై మెట్రో లో పోయిందని.. మెట్రో అధికారులకు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు చేసిన వెంటనే అధికారులు ఆమె ఫోన్ ను తిరిగి ఇచ్చారు. దాంతో చెన్నై మెట్రో సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. అయితే ఆమె ట్వీట్ కు ఓ నెటిజ‌న్ మీకు సొంతంగా కార్లు ఉంటాయి. కదా వాటిలో వెళ్ళచ్చు కదా…. ఇదంతా పబ్లిసిటీ కోసమేనా అంటూ కామెంట్స్ చేశాడు. దానికి కస్తూరి స్పందిస్తూ… తనకు కారు ఏసీ లాంటివి లేవని.. సాధార‌ణ‌ జీవితాన్ని గడుపుతున్నానని చెప్పుకొచ్చింది. ఇక కస్తూరి చేసిన పని చూసి నెటిజ‌న్లు ఆశ్చర్యపోతూ ఆమెను శభాష్ అంటున్నారు.

ALSO READ : బాహుబలి 2 లో అనుష్క పక్కన నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

Visitors Are Also Reading