Home » పవన్‌ కళ్యాణ్‌ వాహనానికి “వారాహి” పేరు ఎందుకు పెట్టారు.. అసలు దాని వెనుక ఉన్న రహస్యం ఏంటీ ?

పవన్‌ కళ్యాణ్‌ వాహనానికి “వారాహి” పేరు ఎందుకు పెట్టారు.. అసలు దాని వెనుక ఉన్న రహస్యం ఏంటీ ?

by Bunty
Ad

ఏపీలో ఏడాదిన్నర కాలంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో అన్ని పార్టీల నాయకులు వారి వారి కార్యక్రమాల్లో చురుకుగా దూసుకుపోతున్నారు. జనసేన పార్టీ కూడా కొద్ది రోజుల్లో ప్రచార యాత్ర ప్రారంభించబోతోంది. దానికోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరికొత్త ప్రచార రథాన్ని సిద్ధం చేసుకున్నారు. ప్రచార రథం పేరు ‘వారాహి’ అని కూడా నామకరణం చేశారు. రథానికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

READ ALSO : Income Tax Raid : ఇన్ కమ్ టాక్స్ రైడ్స్ ఎలా చేస్తారు ? రైడ్ లో దొరికిన డబ్బును ఏం చేస్తారో తెలుసా ?

Advertisement

 

అటు దీనిపై వైసీపీ పార్టీ అభ్యంతరాలు కూడా చెబుతోంది. అయినాప్పటికీ ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వచ్చింది. అసలు వారాహి అనే పేరుకు అర్థం ఏంటి, ఎందుకు పవన్ కళ్యాణ్ తన వాహనానికి ఈ పేరు పెట్టాడు అంటూ తెగ సర్చ్ చేస్తున్నారు. పవన్ ఎన్నికల యుద్ధం కోసం సిద్ధం చేయించిన వాహనం పేరు వారాహి. ఈ పేరు వెనుక ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. పురాణాల గురించి తెలిసిన వారికి విష్ణుమూర్తి వరాహ అవతారం గురించి తెలిసే ఉంటుంది.

Advertisement

విష్ణువు దశావతారాల్లో వరాహ అవతారం ఒకటి. హిరానాక్షుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి, భూమిని సముద్రంలో దాచేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి, హిరనాక్షుడిని సంహరించి, వేదాలను కాపాడి, భూమిని ఉద్దరిస్తాడు. ఇక పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచార రథానికి ఈ పేరు పెట్టడం వెనుక బలమైన కారణం ఉంది అంటున్నారు జనసేన నేతలు. సమస్యలతో సతమతమవుతున్న ప్రజలను చైతన్యపరిచి, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేసి, ప్రజల్లో రాజకీయ చైతన్యం తేవాలనే ఉద్దేశంతో పవన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నాడు. కనుక దాన్ని ప్రతిబింబించేలా ఆయన ప్రచార రథానికి వారాహి అనే పేరు పెట్టారు అంటున్నారు జనసైనికులు.

READ ALSO : మీ మొబైల్‌ ఫోన్‌ లో ఇంటర్‌ నెట్ చాలా స్లో అయ్యిందా? అయితే ఈ టిప్స్‌ పాటిస్తే, స్పీడ్ అవుతుంది

Visitors Are Also Reading