Home » Vishnu priya: అవకాశాల కోసం అలాంటి పని చేసిన తప్పులేదు.. యాంకర్ విష్ణు ప్రియ షాకింగ్ కామెంట్స్..!!

Vishnu priya: అవకాశాల కోసం అలాంటి పని చేసిన తప్పులేదు.. యాంకర్ విష్ణు ప్రియ షాకింగ్ కామెంట్స్..!!

by Sravanthi
Ad

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల కళా ప్రపంచం.. ఈ కళా ప్రపంచంలో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నవారైతే చాలా ఈజీగా రాణించగలుగుతారు.. అలాగే కొత్తవారు ఇండస్ట్రీకి రావాలంటే కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఏది ఏమైనా ఇండస్ట్రీకి ఏ విధంగా వచ్చిన టాలెంట్ లేకుంటే మాత్రం ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఇండస్ట్రీలో మాత్రం రాణించలేరు.. అలా టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి.. అలా ఉన్నప్పుడే స్టార్లుగా ఎదుగుతారు.. కానీ యాంకర్ విష్ణుప్రియ మాత్రం అలా కాదంటుంది.. అవకాశాల కోసం వెళ్ళినప్పుడు మనకు ఇష్టం ఉంటే అలాంటి పని కూడా చేయవచ్చని, ఇద్దరు ఇష్టాఇష్టాల మీదనే ఆధారపడి ఉంటుందని సెన్సేషనల్ కామెంట్ చేసింది.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..

Advertisement

also read:Pulsar 150 బైక్ ను బ్యాన్ చేసిన బజాజ్.. మరి ఆ స్థానములో వచ్చిన బైక్ ఏదో తెలుసా?

యాంకర్ విష్ణు ప్రియ ముందుగా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ముందుగా బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఇలా బుల్లితెరపై ఎంత ప్రయత్నించినా అనుకున్నంత పేరు మాత్రం రాలేదు.. ఎప్పుడైతే సుధీర్ తో కలిసి పోవే పోరా షోలోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పుడే యాంకర్ విష్ణు ప్రియ కెరియర్ మారిపోయింది.. ఒక్కసారిగా పాపులారిటీ పెరిగింది.. ఈటీవీ షోలలో టాప్ యాంకర్ గా ఎదిగింది.. ఈ సమయంలోనే తన అందాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది విష్ణు ప్రియ.. కానీ పోవే పోరా ప్రోగ్రాం నిలిచిపోవడంతో సినిమాల వైపు అడుగు వేసింది.. తాజాగా వాంటెడ్ పండుగాడు చిత్రంలో తన టాలెంట్ నిరూపించుకుంది.

Advertisement

ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ప్రియ కాస్టింగ్ కౌచ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది… తనకు కూడా కాస్టింగ్ కౌచ్ ఎదురైనట్టు చెప్పుకొచ్చింది.. కానీ నేను ఇలాంటి కమిట్మెంట్లు ఇవ్వలేదని తెలియజేసింది. కానీ ఇద్దరికీ ఇష్టం ఉంటే కమిట్మెంట్ ఇవ్వచ్చు అంటూ, దీన్ని తప్పుగా భావించాల్సిన పనిలేదని తెలియజేసింది.. అక్కడ మనల్ని ఎవరూ బలవంతం చేయరు కదా.. మనం ఇష్టం ఉంటేనే ఆ పని చేయడానికి ఒప్పుకుంటాం కదా.. అలాంటప్పుడు తప్పుగా భావించాల్సిన అవసరం ఏముంది అంటూ వివరించింది.. ఇద్దరికీ ఇష్టం లేకుండా ఏ పని జరగదు అంటూ చెప్పుకొచ్చింది విష్ణు ప్రియ.. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.

also read:

Visitors Are Also Reading