బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్ గురించి ప్రస్తుతం పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా ఇషాన్ కిషన్ కి చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి , క్రికెట్ పై మక్కువ ఎక్కువగా ఉండేది. తన చిన్న వయస్సులోనే క్రికెట్ ఆడడం ప్రారంభించాడు ఇషాన్. భాయ్ రాజ్ కిషన్ స్పూర్తి తో క్రికెట్ పై ఇష్టం పెంచుకున్నాడు. ఇషాన్ కి క్రికెట్ తో పాటు టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్ ఆడడం అంటే ఇస్టం. స్పోర్ట్స్ పై ఎక్కువగా ఆసక్తి ఉన్న ఇషాన్ ఏం చదువుకున్నాడు. ఎక్కడ, ఏ కళాశాలలో చదివాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఇషాన్ కిషన్ పూర్తి పేరు ఇషాన్ ప్రణవ్ కుమార్ పాండే కిషన్. అతని నిక్ నేమ్ డెఫినిట్. 5 అడుగుల 6 అంగుళాల ఇషాన్ కి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాాలా ఇష్టం. అతను పాట్నాలోని నవాడలో జులై 18, 1998న జన్మించాడు. అతని చదువులన్నీ బీహార్ నుంచే పూర్తి అయ్యాయి. ఇషాన్ తండ్రి పేరు ప్రణవ్ కుమార్ పాండే బిల్డర్. అతని తల్లి పేరు సుచిత్ర. ఆమె గృహిణి. అతని అన్నయ్య పేరు రాజ్ కిషన్. అతడికి కూడా క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడేవాడు. రాజ్ కిసాన్ రాష్ట్ర స్థాయిలో క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడేవాడు. రాజ్ కిసాన్ రాష్ట్ర స్థాయిలో క్రికెట్ ఆడాడు. అతను ఈ రంగంలో ముందుకు సాగడానికి ఇషాన్ ని ప్రేరేపించడంలో రాజ్ కిషన్ పాత్ర ఎంతో ఉంది. ఇషాన్ పాట్నాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను అభ్యసించాడు.
Advertisement
Also Read : గుజరాత్ ఎన్నికల్లో జడేజా భార్య రివాబా జడేజా విజయం
ఇషాన్ చిన్నప్పటి నుంచి క్రికెట్ ఎక్కువ ఆసక్తిని కలిగి ఉండేవాడు. చదువును సీరియస్ గా తీసుకునేవాడు కాదు. హోం వర్క్ చేసుకొని రమ్మని చెబితే వాటికి బదులు నోట్ బుక్స్ పై క్రికెట్ కి సంబంధించి బాల్, బ్యాట్, క్రికెట్ మైదానం వంటి వాటిని గీసేవాడు. అతను చదువుపై సీరియస్ గా లేడని ఉపాధ్యాయులు ఫిర్యాదు చేసినందున అతను చాలా సార్లు తరగతి నుంచి బహిస్కరించబడ్డాడు.. పాఠశాల విద్య తరువాత ఇషాన్ పాట్నాలోని కాలేజ్ ఆఫ్ కామర్స్ లో చదివాడు. ఏడేళ్లలో స్కూల్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. స్కూల్ లో జాయిన్ అయిన ఒక సంవత్సరం వయస్సులో స్కూల్ వరల్డ్ కప్ కోసం తన స్కూల్ క్రికెట్ టీమ్ కి ప్రాతినిథ్యం వహించాడు. ఇది అలీఘర్ లో నిర్వహించబడతుంది. కొన్ని సమస్యల కారణంగా ఇషాన్ బీహార్ కి బదులు జార్ఖండ్ తరపున క్రికెట్ ఆడాడు.
Also Read : భారత క్రికెటర్ ఇషాన్ కిషన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ?