Home » భారత క్రికెటర్ ఇషాన్ కిషన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ? 

భారత క్రికెటర్ ఇషాన్ కిషన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ? 

by Anji
Ad

టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో తన కెరీర్ లోనే డబుల్ సెంచరీ సాధించి రికార్డు సొంతం చేసుకున్న ఈ స్టార్ క్రికెటర్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ స్టార్ క్రికెటర్ సూపర్ ఇన్నింగ్స్ కు సాక్షిగా నిలిచిన విరాట్ కోహ్లీ మొదలు వీరేంద్ర సెహ్వాగ్, హార్దిక్ పాండ్యా, సచిన్ టెండూల్కర్ ఇలా సహచర, మాజీ క్రికెటర్లు ఇషాన్ ని పొగడ్తలతో ముంచెత్తున్నారు. 

Advertisement

ఇదిలా ఉండగా.. ఓ స్పెషల్ పర్సన్ నుంచి ఇషాన్ కిషన్ కి విషెస్ అందడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మరెవ్వరో కాదండోయ్.. ఇషాన్ కిషన్ ప్రియురాలుగా ప్రచారంలో ఉన్న అదితి హుండియా. ఇషాన్ ఫోటోను ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసిన అదితి.. రెడ్ హార్ట్ ఎమోజీతో తన ప్రేమను చాటుకుంది. అంతేకాదు.. అతని స్పెషల్ ఇన్నింగ్స్ కి సంబంధించి బీసీసీఐ షేర్ చేసిన పోస్టును కూడా రీషేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఇషాన్, అదితి పేర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. 2019లో మిస్ ఇండియా పోటీలలో ఫైనల్ చేరుకుంది అదితి. మోడల్ గా కెరీర్ ని కొనసాగిస్తోంది. ఇషాన్ గర్ల్ ఫ్రెండ్ ఈమె ప్రచారంలో ఉంది. వీరిద్దరూ పలుమార్ల జంటగా దర్శనమిచ్చారు. ప్రధానంగా ఐపీఎల్ లో ఇషాన్ కిషన్ ప్రాతినిథ్యం వహిస్తున్న మ్యాచ్ లకు ముంబై జెర్సీ వేసుకొని పలుమార్లు హాజరు అయింది అదితి. 

Advertisement

Also Read :  డబుల్ సెంచరీ చేసిన హీరోలు..4 గురు ఇండియన్సే

అదేవిధంగా ఇన్ స్టాలో ఆమె పెట్టిన పోస్టులకు ఇషాన్, ఇషాన్ పెట్టిన పోస్టులకు అదితి రిప్లైలు ఇచ్చుకుంటున్నారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పలు వార్తలు వినిపించాయి. ఇక తమ రిలేషన్ షిప్ పై ఇషాన్ కానీ అదితి కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా బంగ్లాదేశ్ మూడో వన్డేలో ఇషాన్ డబుల్ సెంచరీ పై ప్రశంసలు కురిపిస్తూ అదితి షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అదితి గతంలో ఎఫ్బీబీ కలర్స్ ఫెమినా మిస్ ఇండియా రాజస్థాన్ కిరీటానని దక్కించుకుంది. మిస్ దివా 2018 తొలి రన్నరఫ్ గా నిలిచింది. మిస్ సుప్రా నేషనల్ 2018 టైటిల్ కూడా గెలుచుకుంది. 2019 మిస్ పోటీలలో ఫైనలిస్టుగా నిలిచింది. ఈమెకు కూడా సోషల్ మీడియాలో భారీగానే పాలోయింగ్ ఉంది. ఈమె షేర్ చేేసే ఫోటోలకు నెటిజన్లు లైకులు, షేర్ల వర్షం కురిపిస్తున్నారు.

Also Read :  బరువు తగ్గడానికి మీ ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ప్రోటీన్ పౌడర్ ని ఇలా తయారు చేసుకోండి..!

Visitors Are Also Reading