తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత లేటెస్ట్ గా విడుదలై సంచలన విజయన్ని అందుకున్న మూవీ యశోద.. ఈ చిత్రం నవంబర్ 11వ తేదీన థియేటర్లోకి వచ్చింది.. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ తరుణంలో యశోద సినిమా చుట్టు ఊహించని వివాదాలు చుట్టుముట్టాయి.. అయినా మూవీ విడుదల ఆగలేదు.. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీకి హరి హరీష్ డైరెక్షన్ చేశారు.. ఈ చిత్రంలో వరలక్ష్మి,ఉన్ని ముకుందన్,రావు రమేష్, శరత్ కుమార్ ప్రధాన పాత్రలో మెప్పించారని చెప్పవచ్చు.. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలింక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతం మూవీకి మరింత ప్లస్ అయిందని చెప్పవచ్చు..
Advertisement
also read:సావిత్రి కెరీర్ నే మార్చేసిన ఈ సాంగ్ గురించి మీకు తెలుసా ?
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన మూవీ మంచి పేరు సంపాదించుకుంది.. ఇక అమెరికాలో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్ వసూలు చేస్తుందట.. అమెరికాలోని హాఫ్ మిలియన్ మార్క్ దాటిందని, ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఏ సినిమా ఈ లెవెల్లో రాలేదని అంటున్నారు సినిమా విశ్లేషకులు.. యశోద సినిమాకు దాదాపుగా 30 కోట్ల బడ్జెట్ పెట్టినట్టు తెలుస్తోంది.. మరి ఇంత బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ ఎన్ని కోట్లు సంపాదించిందో ఇప్పుడు చూద్దాం.. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.30 కోట్ల షేర్,16.60 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. ఏకంగా నైజాంలో 4.55 కోటి రూపాయలు, సీడెడ్ లో 95 లక్షలు, తూర్పుగోదావరి జిల్లాలో 56 లక్షలు, ఉత్తరాంధ్రలో 1.36 కోట్ల షేర్, పశ్చిమగోదావరిలో 34 లక్షలు, కృష్ణాజిల్లాలో 65 లక్షలు, గుంటూరులో 60 లక్షలు, నెల్లూరు జిల్లాలో 29 లక్షల షేర్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది.
Advertisement
ఇక తమిళంలో 1.35 కోట్లు, కర్ణాటక మిగతా రాష్ట్రాలలో1.35 కోట్లు, ఓవర్సీస్ లో 2.5 కోట్లు వసూలు రాబట్టింది. ఇక హిందీలో రెండు కోట్ల మేర వసూళ్లను రాబట్టిందని ఈ మూవీ ప్రపంచం మొత్తం 14.85 కోట్లు,32.15 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తోంది. యశోద మూవీ 12 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ ప్రయాణాన్ని మొదలుపెట్టింది.. ముఖ్యంగా సమంత కెరీర్ లో వచ్చిన లేడి ఓరియంటల్ సినిమాలో ఇది రికార్డు క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. టోటల్ గా చూసుకుంటే మూడు కోట్ల మేర లాభాలను తెచ్చి పెట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో సరోగసి బ్యాక్ డ్రాప్ ప్రధాన అంశంగా తెరకెక్కించారు హరి హరీష్.. దీంతో ఈ సినిమా విజయం అందుకుంది..
also read: