Home » సావిత్రి కెరీర్ నే మార్చేసిన ఈ సాంగ్ గురించి మీకు తెలుసా ?  

సావిత్రి కెరీర్ నే మార్చేసిన ఈ సాంగ్ గురించి మీకు తెలుసా ?  

by Anji
Ad

మహానటి సావిత్రి గురించి తెలియని వారుండరు. ఆమె నటిగా ఎంతటి పాపులారిటీని సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రధానంగా తమిళ స్టార్ హీరోలు అయినటువంటి శివాజీ గణేషన్, ఎంజీఆర్,  జెమిని గణేషన్ వంటి హీరోలతో పాటు తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. 

Advertisement

తన సినీ కెరీర్ ప్రారంభంలో అక్కినేని నాగేశ్వరరావు సరసన ఓ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. దీంతో సావిత్రికి చాలా కోపం వచ్చిందట. కొద్ది రోజుల పాటు కుమిలిపోయి ఒంటరిగా ఏడుస్తూ కూర్చొందట. ఇక ఆ తరువాత తాను ఏంటో నిరూపించుకోవాలనే తపన ఆమెలో మొదలైంది. అద్దం ముందు గంటల తరబడి నిలబడి చలాకిగా డైలాగ్ లు చెప్పడం.. భావోద్వేగాలను అభినయించడం వంటికి ప్రాక్టీస్ చేసేదట సావిత్రి. ఆ తరువాత కొద్ది రోజుల తరువాత 1951లో పాతాళ బైరవి సినిమాలో ఓ నాట్యానికి సెలక్షన్లు జరుగుతున్నాయని సావిత్రి వాహిని స్టూడియోకి వెళ్లింది. అక్కడ దర్శకుడు కేవీ రెడ్డిని కలిసింది.  ఈమె ఆడిషన్స్ చూసి “నేను రాను అంటే రాను” అనే పాటకు సావిత్రి ఎంపిక అయింది. ఈ సినిమాలో ఈ పాట చాలా హైలెట్ గా నిలిచింది.  

Advertisement

Also Read :  పెళ్లి చేసుకోబోతున్న సూర్య వెబ్ సిరీస్ హీరోయిన్.. వరుడు ఎవరంటే ?

ఆ నాట్య సన్నివేశంలో చూసిన వారందరూ ఎవరు ఈ మెరుపు తీగ అన్నట్టుగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక అప్పటి నుంచి ఆమె ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సాంగ్ తోనే సావిత్రి  కెరీర్ టర్నింగ్ అయిందని చెప్పవచ్చు. ఈ పాట తరువాత తెలుగు, తమిళ భాషల్లో వరుస ఆఫర్లను చేజిక్కించుకుని పాపులారిటీని సంపాదించుకుంది. అదేవిధంగా ఈమె ఇతరులకు సాయం చేయడంలో కూడా ముందుండేది. ఈమె మంచి తనాన్ని ఆసరాగా తీసుకొని అన్యాయం చేసి చివరికీ ఎవ్వరు లేని అనాథగా వదిలేశారు. 

Also Read :  నాపై ట్రోల్స్ చేస్తే..దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన మంచు లక్ష్మి !

Visitors Are Also Reading