Home » ఉదయం నిద్ర లేవడానికి, రాత్రి నిద్రించడానికి బెస్ట్ సమయం ఏదో తెలుసా ?

ఉదయం నిద్ర లేవడానికి, రాత్రి నిద్రించడానికి బెస్ట్ సమయం ఏదో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా త్వరగా పడుకొని త్వరగా నిద్ర లేవడం ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి రెండింటికీ ఎంతో మేలు చేస్తుందని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం.  బిజీ లైఫ్ స్టైల్ వల్ల ప్రస్తుతం తమ సౌకర్యాన్ని బట్టి నిద్ర పోతున్నారు. అయినప్పటికీ ఒక ప్రశ్న మాత్రం తలెత్తుతూనే ఉంది. అసలు ఆరోగ్యంగా ఉండడానికి నిద్రించడానికి, నిద్రలోంచి మేల్కొనడానికి ఉత్తమమైన సమయం ఏది ? త్వరగా నిద్ర పోవడం, త్వరగా నిద్ర లేవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Advertisement

ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి సమయంలో తొందరగా పడుకొని తెల్లవారుజామునే నిద్ర లేవాలి. మన నిద్ర, సూర్యుని నమూనాలు మన జీవసంబంధ ధోరణులతో సమానంగా ఉంటాయి. సూర్యస్తమయం తరువాత సహజంగా ఎక్కువ నిద్ర వస్తుందని ప్రజలు భావించవచ్చు. శరరీ అలసటను తొలగించి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా ముఖ్యం. రాత్రి నిద్రించడానికి సరైన సమయం ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. శరీరానికి నిద్ర ఎంత అవసరమో రాత్రి నిద్రించడానికి వయస్సును బట్టి నిర్ణయించవచ్చు. ప్రతీ వ్యక్తికి 7 గంటల నిద్ర తప్పనిసరి. బిజీ లైఫ్ స్టైల్ ఉన్నప్పటికీ ఉదయం 6 గంటలకు నిద్రలేచి రాత్రి 11 గంటల వరకు నిద్రపోవడం ఆరోగ్యం పరంగా మంచిదని భావిస్తారు. 

Advertisement

Also Read :  ఉదయం ఖాళీ కడుపుతో నల్ల శనగలు నానబెట్టిన నీటిని తాగితే ప్రయోజనాలు ఎన్నో..!

Sleep Better : రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా?… ఈ టిప్స్‌ తో ఎంచక్కా  నిద్రపోండి. - Telugudunia

ప్రతీ వ్యక్తికి అతని శారీరక శ్రమ, వయస్సు ఆధారంగా నిద్ర చాలా అవసరం. ముఖ్యంగా 3-12 నెలల పిల్లలకు 12 నుంచి 16 గంటలు నిద్ర అవసరం. అదేవిధంగా 1 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు 10 నుంచి 12 గంటలు, 9-18 సంవత్సరాల వయస్సు వారికి 8నుంచి 10 గంటలు, 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలలోపు గల వ్యక్తికి 7 నుంచి 8 గంటల తగినంత నిద్ర అవసరం. ఒక వ్యక్తి పగటిపూట నిద్రపోతున్నట్టు అనిపిస్తే.. అతనికి రాత్రిపూట తగినంత నిద్ర పట్టడం లేదని సంకేతం. నిద్ర లేకపోవడం వల్ల చిరాకు, మతిమరుపు, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు.. హైబీపీ, మధుమేహం, గుండెజబ్బులు, ఊబకాయం, డిప్రెషన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తక్కువ నిద్రపోవడం ఎంత హానికరమో ఎక్కువ నిద్ర పోవడం కూడా అంతే హానికరం. 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోయిన తరువాత కూడా మీరు నిద్రపోతున్నట్టు అనిపిస్తే.. డిప్రెషన్, చిరాకు, గుండె జబ్బులు, ఆందోళన, స్వీప్ అప్నియా, మధుమేహం, ఊబకాయం, థైరాయిడ్, ఆస్తమా వంటి వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. 

Also Read :  ఆ వ్యక్తులు పొరపాటున కూడా గుడ్లు తినకూడదు.. ఇక తింటే అంతే సంగతులు..!

Visitors Are Also Reading