సాధారణంగా అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా సొట్ట బుగ్గలు పడుతూ ఉంటాయి.. ఈ బుగ్గలు వారికి మరింత అందాన్ని అందిస్తాయి. అలాంటి సొట్ట బుగ్గలు పడితే చాలామంది అదృష్టంగా భావిస్తారు.. మరి సొట్ట బుగ్గలు పడితే ఎవరికి అదృష్టం, ఎవరికి నష్టం అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. సొట్టబుగ్గలకు చాలా చరిత్ర ఉంది. ఈ బుగ్గలు ఉన్న చాలామంది సెలబ్రిటీలను చూస్తే నిజంగానే సొట్టబుగ్గల ఉంటే అదృష్టం కలిసి వస్తుందా అని అనిపిస్తుంది. దీనిపై కొంతమంది పండితులు విష్ణు పురాణాన్ని బయటకు తీశారు. సొట్టబుగ్గలు ఉంటే అమ్మాయిలకు అదృష్టం ఎక్కువగా ఉంటుందట.
Advertisement
also read:“మగధీర” సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా…? మీకూ అదే డౌట్ వచ్చిందా..?
Advertisement
వారిని చేసుకున్న వారు జీవితంలో చాలా సుఖపడతారని, ఆర్థికపరంగా గాని, సంసార జీవితపరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంసారం సాఫీగా సాగిపోతుందనేది నిజం. సొట్టబుగ్గలు ఉన్నవారు చాలా అణిగిమనిగి ఉంటారట. కానీ వారితో అనవసరంగా పెట్టుకుంటే మాత్రం వెంటనే వారికి సమాధానం చెప్తారట. సొట్టబుగ్గలు ఉన్నవారు ఎక్కువగా నవ్వుతూ ఉంటారు. చాలా అందంగా కనిపిస్తారు. వారు కొంచెం సీరియస్ గా ఉన్నా ఆ సొట్ట బుగ్గ మాత్రం ఎక్స్ప్రెషన్స్ మారుస్తుంది. సొట్టబుగ్గలు ఉన్నవారు చాలా అదృష్టవంతులే కానీ వీరి వల్ల ఆ ఒక్కరికి మాత్రమే నష్టం కలుగుతుందని విష్ణు పురాణంలో రాసి వుంది.. మరి వారెవరో చూద్దాం..
సొట్టబుగ్గలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే భర్తకు చాలా మంచిది, కానీ అత్తకు మాత్రం కలిసి రాదు. ఇద్దరికీ అస్సలు పడదు. ఎప్పుడూ గొడవ పెట్టుకుంటారని శాస్త్రం చెబుతోంది. కొన్నిసార్లు సొట్టబుగ్గలు ఉన్న కోడళ్లు అత్తకు గండంగా కూడా మారవచ్చు అని అంటున్నారు. ఇక ఈ సొట్ట బుగ్గలు మగవారికి ఉంటే తల్లికి ఆయుష్షు పెరుగుతుందని అంటారు. ఒకవేళ ఆడపిల్లకు ఈ సొట్ట బుగ్గ ఉంటే మాత్రం అత్త పాలిట యముడులా తయారవుతారట. కోడలు ఇంట్లోకి రాగానే ఆమె మరణించడం కానీ, పోరు తట్టుకోలేకపోవడం కానీ జరుగుతుందని విష్ణు పురాణం చెబుతోంది.
also read: