యాక్టర్ సత్యప్రకాశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎన్నో సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యప్రకాశ్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ మధ్య సాధారణంగా తాను ఆ సీన్ చేయను, ఈ సీన్ చేయను అని చెప్పే స్థోమత నాకు లేదు. ఇదివరకు ఉన్న సినిమాల పరిస్థితి ఇప్పుడున్న సినిమాల పరిస్థితి వేరు అని చెప్పుకొచ్చారు సత్యప్రకాశ్. తాను చేసిన పెళ్లి చేసుకుందాం సినిమాలో వర్షం పడుతుంటే సౌందర్యని లాగి వ్యాన్ లో తీసుకొని వెళ్లే సీన్ జనాలకు ఇప్పటికీ గుర్తుకు ఉంది.
హీరోయిన్ సౌందర్య గారు సత్యప్రకాశ్ పైన కంప్లెంట్ ఇచ్చిందని యాంకర్ ప్రశ్నించగా.. ఇందుకు సత్యప్రకాశ్ ఈ విధంగా సమాధానం చెప్పాడు. “చూడాలనివుంది సినిమాలో హీరోయిన్ సౌందర్య. నేను అన్నపూర్ణ స్టూడియో ఒక సెట్ లో షూటింగ్ చేస్తున్నాను. మరోపక్కా మెగాస్టార్ చిరంజీవి ఉన్నారని తెలిస్తే కలవడానికి వెళ్లాను. ఆ సమయంలో అక్కడ సౌందర్య కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో 7 వారాల నగలు వంటి తీస్తున్నారు. నా కెరీర్ లో ఒక సినిమాలో ఒక సంఘటన జరిగింది.
ఆ సంఘటనకు కారణం ఈయనే అని చెప్పుకొచ్చింది. ఒక సమయంలో మెగాస్టార్ చిరంజీవి నన్ను పిలిచి నువ్వు షూటింగ్ కి ఎలా వస్తావు అని అడిగాడు. స్కూటర్ పై అని చెప్పాను. నువ్వు హెల్మెట్ పెట్టుకుంటావా అని అడిగాడు. పెట్టుకోను అని చెప్పాను. నువ్వు పెద్ద స్టార్ అవుతావు. నువ్వు స్కూటర్ వెళ్లడం, రావడం సమయంలో తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి” అని సూచించినట్టు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవిని ఎంతో మంది ఆదర్శంగా తీసుకొని సినిమాల్లోకి వచ్చారని చెప్పుకొచ్చారు సత్యప్రకాశ్.
Also Read : సిగ్గులేదా… ఆమెను పెళ్లి చేసుకున్నావ్..అంటూ యాదమ్మరాజు పై దారుణమైన ట్రోలింగ్..!