సాధారణంగా నిద్రపోయిన సమయంలో మన కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు లేదంటే ఇతర స్నేహితులు చనిపోయిన వారు అప్పుడప్పుడు కలలో కనిపిస్తూ ఉంటారు. దీంతో ఒక్కసారిగా నిద్రపోయిన వారు భయాందోళనలకు గురవుతూ ఉంటారు.. అయితే చనిపోయిన వారు కలలో కనిపించడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయట.. కలల శాస్త్రం ప్రకారం వారు మన కలలో కనిపిస్తున్నారు అంటే వారి యొక్క ఆత్మ ఈ లోకంలో సంచరిస్తుందని అర్థం చేసుకోవాలి.
Advertisement
also read;హీరో అవ్వాల్సిన ఆ వ్యక్తి మోహన్ బాబు వల్ల ట్రావెల్స్ ఓనరయ్యాడు.. ఎలా..?
అయితే ఈ చనిపోయిన వారి ఆత్మలు మన కలలో కనిపించినప్పుడు కొన్ని నియమాలను పాటించాలని, దీనివల్ల శుభ ఫలితాలు పొందవచ్చని స్వప్న శాస్త్ర నిపుణులు అంటున్నారు.. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తులు తరచూ కలలో కనిపించినట్టయితే రామాయణ, భగవద్గీత పురాణాలను చదవాలి.. ఒకవేళ వారు ఎంతో బాధతో ఏమీ మాట్లాడకుండా మన కలలో కనిపిస్తే మీరు ఏదో తప్పు చేయబోతున్నారని సంకేతమట. అదేవిధంగా మన చనిపోయిన బంధువులు ఆకలితో కనబడితే వెంటనే పేదవారికి అన్నదానం చేయాలి.
Advertisement
దీనివల్ల మన బంధువుల ఆత్మ సంతోషపడుతుంది. ఒకవేళ చనిపోయిన వ్యక్తులు కోపంతో మీ కలలో కనిపిస్తే వారు మీ నుంచి ఏదో ఆశిస్తున్నారని అర్థం. ఒక్కోసారి చనిపోయిన మన కుటుంబీకులు సంతోషంగా కలలో కనిపిస్తూ ఉంటారు. వారు అలా సంతోషంగా నవ్వుతూ కనిపించడం వల్ల మనకు శుభ పరిణామాలు జరగబోతున్నాయని స్వప్న శాస్త్ర నిపుణులు అంటున్నారు. కొంతమంది తీరని కోరికతో మరణిస్తారు. అలాంటివారు మన కలలో కనిపించి ఇలా చేయమని సలహా ఇచ్చినట్లయితే వారు చెప్పిన దాని ప్రకారం మనం చేస్తే వారి ఆత్మ సంతృప్తి చెందుతుందని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
also read: