ప్రతి ఇంట్లో ఇల్లాలినే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. అలాంటి లక్ష్మీ స్వరూపమైన ఇంటి ఇల్లాలు శుక్రవారం రోజున ఇల్లు దులపవచ్చా? అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. మరి ఆ అనుమానాలు నివృత్తి చేసుకుందాం. చాలామంది లక్ష్మీదేవి కటాక్షం పొందాలని సకల ప్రయత్నాలు చేస్తుంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటేనే మనకు అన్ని సంపదలు సమకూరుతాయి.
Advertisement
also read:సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలకు నాగార్జున ఎందుకు రాలేదు ?
ఈ విధంగా లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి చాలామంది అనేక పూజలు చేస్తూ ఉంటారు. శుక్రవారం రోజున ఇల్లంతా శుద్ధి చేసుకుని అలంకరిస్తారు. ఇంటి గడపకు పసుపు రాసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. శుక్రవారం సెంటిమెంట్ గా భావించి కొంతమంది డబ్బులు కూడా ఎవరికి ఇవ్వరు. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకమైన రోజు కాబట్టి. ఈ విధంగా చాలామంది అనేక నియమాలు పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా శంఖం శబ్దం వినిపించని ఇంట్లో కూడా లక్ష్మీ దేవి నివాసం ఉండదట.
Advertisement
అలాగే తులసిని మహిళలు పూజించని చోట కూడా లక్ష్మీదేవి ఉండదట. అలాగే అతిధులకు భోజనాలు పెట్టని ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదట. అంతేకాకుండా ఇంటి ఇల్లాలు శుక్రవారం రోజున కంటతడి పెడితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట. అలాగే శుక్రవారం రోజున ఇంటి ఇల్లాలు ఇల్లు దులుపుకుంటూ కూర్చుంటే లక్ష్మీ ఆరాధనకు సమయం సరిపోదు. కాబట్టి శుక్రవారం మహిళలు ఇల్లు దులపకూడదని జ్యోతిష్య నిపుణులు అంటుంటారు.
also read: