Home » సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలకు నాగార్జున ఎందుకు రాలేదు ?

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలకు నాగార్జున ఎందుకు రాలేదు ?

by Anji
Ad

సూపర్ స్టార్ కృష్ణ మరణించి రెండు రోజులు అవుతున్నా  కూడా ఆయన అభిమానులు ఇంకా ఆ విషయాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. టాలీవుడ్  ఇండస్ట్రీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితిలో కనిపించడం లేదు. రెండు రోజులుగా అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చి కృష్ణ పార్థివదేహాన్ని వీక్షించారు. బుధవారం మధ్యాహ్నం వరకు సందర్శించారు. మధ్యాహ్నం 2 గంటల తరువాత  పద్మాలయ స్టూడియో నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానంకి తరలించారు. ఆ తరువాత  ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కృష్ణ  అంత్యక్రియలు నిర్వహించారు. 

Advertisement

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిసిపోవడంతో ఒక జనరేషన్ కి తెర ముగిసింది. సాధారణంగా టాలీవుడ్ అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు అని చెబుతుంటారు. ఈ ఐదుగురు నేటితో గగనంలో   ధృవ తారలుగా మిగిలారు. కృష్ణ పార్థివ దేహానికి చివరిసారి వీడ్కోలు పలకడానికి టాలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది.  మెగాస్టార్ నుంచి కుర్ర హీరోల వరకు ప్రతి ఒక్కరూ కృష్ణ నివాళులర్పించి మహేష్ బాబుని ఓదార్చారు. కృష్ణ పార్థివ దేహాన్ని చూడని ఏకైక హీరో మాత్రం అక్కినేని నాగార్జున అనే చెప్పాలి. రెండు రోజులుగా ఆయన ఎక్కడ కూడా కనిపించకపోవడం గమనార్హం.  

Advertisement

Also Read :  కృష్ణ రెండో పెళ్లి విషయంలో ఇందిరాదేవికి తెలియకుండా తెర వెనుక మోసం చేసిన టాప్ హీరో ?

Akkineni Nagarjuna : Manam News

నాగార్జున ఎక్కడ అని అభిమానులు ఆరా తీస్తున్నారు. కృష్ణ కుటుంబానికి, అక్కినేని కుటుంబానికి మంచి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. కృష్ణతో కలిసి నాగార్జున వారసుడు అనే సినిమాలో నటించాడు. కృష్ణతో ఎంత ప్రేమగా ఉండేవాడో నాగార్జున మహేష్ తో కూడా అంతే ప్రేమగా ఉండేవాడు. కృష్ణ మరణవార్త  విని ట్వీట్ చేసిన నాగార్జున మాత్రం కృష్ణను చూడడానికి ఎందుకు రాలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున వారసులు అక్కినేని నాగచైతన్య, అఖిల్ కృష్ణ పార్థివ దేహాన్ని చూడడానికి వచ్చారు. నాగార్జున ఏదైనా ప్రాజెక్ట్ లో ఇతర దేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయాడని చెప్పడానికి ప్రస్తుతం నాగార్జున  ప్రాజెక్ట్ లో కూడా లేడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అసలు నాగార్జున కృష్ణ అంత్యక్రియలకు ఎందుకు రాలేదని అభిమానులు ఆరా తీస్తున్నారు. దీనిపై నాగార్జున స్పందిస్తే కానీ ఓ క్లారిటీ రాదు. 

Also Read :  సూపర్ స్టార్ కృష్ణ తన ఆస్తి మొత్తం ఎవరికి రాసిచ్చారో తెలుసా ?

Visitors Are Also Reading