Home » కృష్ణ రెండో పెళ్లి విషయంలో ఇందిరాదేవికి తెలియకుండా తెర వెనుక మోసం చేసిన టాప్ హీరో ?

కృష్ణ రెండో పెళ్లి విషయంలో ఇందిరాదేవికి తెలియకుండా తెర వెనుక మోసం చేసిన టాప్ హీరో ?

by Anji
Ad

సూపర్ స్టార్ కృష్ణ మరణించి రెండు రోజులు అవుతున్నా  కూడా ఆయన అభిమానులు ఇంకా ఆ విషయాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ ఇండస్ట్రీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితిలో కనిపించడం లేదు. మరోవైపు ఒకే ఏడాదిలో మహేష్ బాబు కుటుంబంలో ముగ్గురు చనిపోవడం నిజంగా ఏ స్టార్ కుటుంబంలో కూడా ఇలా జరగలేదేమో. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ మొత్తం మూగబోయింది. సినీ ఇండస్ట్రీలో ఒక చరిత్రను సృష్టించిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ . ఆయన పేరిట ఉన్న రికార్డులు మరే హీరోకు లేవనే చెప్పాలి. 

Advertisement

మరోవైపు కృష్ణకు సంబంధించిన పలు కీలకమైన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి కృష్ణ, విజయనిర్మల పెళ్లి.   అప్పటికే పెళ్లి అయి పిల్లలు పుట్టిన తర్వాత కృష్ణ విజయనిర్మలను రెండో  పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి మాత్రం అంత ఈజీగా ఏం జరగలేదట. ఓ సినిమా స్టోరీని తలపించే విధంగానే  వాళ్ల పెళ్లిలో కూడా చాలా ట్విస్టులు చోటు చేసుకున్నాయట. అప్పటికే విజయనిర్మలకు కృష్ణమూర్తి అనే వ్యక్తితో పెళ్లి అయింది. ఒక కొడుకు (నరేష్) కూడా పుట్టాడు. అప్పటికీ విజయనిర్మల ఇంకా సినిమాల్లోకి కూడా రాలేదు. పెళ్లి తర్వాత సినిమాల్లోకి రావాలని విజయనిర్మల కలలు కన్నది. కానీ భర్త కృష్ణమూర్తికి విజయనిర్మల సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. అయినప్పటికీ  ఆమె సినిమాల్లోకి వెళ్లారు. కృష్ణతో ఎక్కువ సినిమాలు చేయడంతో వారి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో అది పెళ్లి వరకు వచ్చింది.

Advertisement

Also Read :  న‌రేష్ చేసిన ప‌నికి కృష్ణ‌గారి ఆత్మ‌కూడా శాంతించ‌దు..సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

చంద్రమోహన్ తొలి నుంచే విజయనిర్మలకి చాలా ఆప్తుడిగా ఉండేవారు. ఆయనే వీరి పెళ్లికి సహకరించారు. చాలా మంది సన్నిహితులే వాళ్ల పెళ్లికి మద్దతు ఇవ్వకున్నా.. చంద్రమోహన్ వారి పెళ్లికి సహకరించారు. చంద్రమోహన్ ని విజయ నిర్మల దగ్గరికి మధ్యవర్తిత్వం కోసం పంపించారట. కృష్ణ తరపున చంద్రమోహన్ వెళ్లి అడిగారట. ఒకవేళ ఆయనకు పెళ్లి చేసుకోవాలని ఉంటే ఆయనే వచ్చి డైరెక్ట్ గా అడగాలని విజయనిర్మల చంద్రమోహన్ కి చెప్పిందట. దీంతో కృష్ణ నేరుగా వెళ్లి విజయనిర్మలను అడిగారట. విజయ నిర్మల వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. చంద్రమోహన్ దగ్గర ఉండి వారి పెళ్లిని రహస్యంగా జరిపించారట. తిరుపతి శ్రీవారి సన్నిధిలో కృష్ణ, విజయ నిర్మల పెళ్లి జరిగింది. ఇక ఈ విషయం తన మొదటి భార్య ఇందిరా దేవికి ముందే చెప్పి ఆమె అనుమతి తీసుకొని విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నారట కృష్ణ. 

Also Read :  సూపర్ స్టార్ కృష్ణ తన ఆస్తి మొత్తం ఎవరికి రాసిచ్చారో తెలుసా ? 

Visitors Are Also Reading