రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమ కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Advertisement
తెలంగాణలో నేడు 8 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుండి ఆన్లైన్ ద్వారా ఈ మెడికల్ కాలేజీ లను ప్రారంభిస్తారు.
కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జాతీయ క్రీడ పురస్కారాలకు ఎంపిక చేసిన క్రీడాకారుల జాబితాను విడుదల చేసింది. ఈ నెల 30న రాష్ట్రపతి భవన్ లో ఈ అవార్డులను ప్రధానం చేయనున్నారు.
విశాఖ లో సీఎం జగన్ నేడు ఉత్తర నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు సమావేశం జరగనుండగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కె.కె.రాజు సహా 50మందితో మీటింగ్ జరగనుంది.
సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దిగ్భ్రాంతి. వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు అని కేసీఆర్ అన్నారు. నటుడిగా, నిర్మాత, దర్శకుడిగా, కృష్ణ అందించిన సేవలు గుర్తుచేసుకున్నారు.
Advertisement
అన్నమయ్య జిల్లా పీలేరులో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. మల్లికార్జున అనే వ్యక్తిపై నాటు తుపాకీతో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. మల్లికార్జునకు తీవ్రగాయాలు కావడం తో ఆస్పత్రికి తరలించారు.
కాకినాడ సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాలేజీలో సీనియర్లు, జూనియర్ల మధ్య చెలరేగిన వివాదం, ల్యాబ్‌లోని వస్తువులతో దాడి చేసుకున్న విద్యార్థులు, ఫైనలియర్ విద్యార్థులకు గాయాలు కావడంతో తో ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్‌ఫ్రాలో కొనసాగుతున్న జీఎస్టీ అధికారుల తనిఖీలు నిర్విహించారు. 8 గంటలకు ఈ సోదాలు కొనసాగాయి. కమిషనర్ నీతూ ప్రసాద్ ఆధ్వర్యంలో 20 బృందాలతో తనిఖీలు నిర్వహించారు.
కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు భారీగా నిధులు కేటాయించాలని కోరారు. లక్డీకాపూల్–బీహెచ్ఈఎల్, నాగోల్ – ఎల్బీనగర్ మెట్రో అనుసంధానం పనులకు నిధులుఇవ్వాలని లేఖలో కోరారు.