Home » అన్న పూర్ణ స్టూడియో వివాదంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ కి మధ్య గొడవ ఎందుకు జరిగింది ? కోర్టు వరకు వెళ్లారా ?

అన్న పూర్ణ స్టూడియో వివాదంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ కి మధ్య గొడవ ఎందుకు జరిగింది ? కోర్టు వరకు వెళ్లారా ?

by Anji
Ad

తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ రెండు కళ్లలాంటి వారు. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. సినీ రంగంలో పోటీ ఉంటుంది. కానీ ఇద్దరూ అగ్ర హీరోలు మాత్రం ఓవైపు పోటీ పడుతూనే మరోవైపు మంచి మిత్రులుగా కలిసి ఉండేవారు. అదేవిధంగా సినీ పరిశ్రమకి సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేవారు. అలాంటి వీరిద్దరి మధ్య మనస్పార్థాలు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకసారి వీరిద్దరూ కోర్టు వరకు వెళ్లి పోరాడారు. 

Advertisement

మద్రాస్ నుంచి హైదరాబాద్ కి సినిమా ఇండస్ట్రీని తరలించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు హైదరాబాద్ లో ప్రభుత్వం స్థలాలను కేటాయించింది. ఏఎన్నార్ హైదరాబాద్ లో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. అక్కడ ఉన్నటువంటి కొండ దిగువ ప్రాంతం కూడా వారికే కేటాయించింది. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం స్థలం కేటాయిస్తే.. నాగేశ్వరరావు టింబర్ వ్యాపారాన్ని 7 ఎకరాల స్థలంలో నిర్వహించేవారు.

Advertisement

Also Read :  ఎన్టీఆర్ తో ఆ సీన్ చచ్చిన చేయనని ఖరాకండిగా చెప్పేసిన భానుమతి.. ఎందుకో తెలుసా ?

అక్కడ అన్నపూర్ణ స్టూడియో నిర్మించి షూటింగ్ లు జరుగుతున్న సమయంలో పక్కనే ఉన్న 7 ఎకరాల్లో టింబర్ వ్యాపారం చేయడాన్ని ప్రభుత్వం  దృష్టికి తీసుకురాగా.. అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం ఈ విషయంలో కోర్టుకి వెళ్లింది. ఏఎన్నార్ కి వ్యతిరేకంగా ఎన్టీఆర్  కోర్టులో పోరాడారు. ఏఎన్నార్ గారు మాత్రం టింబర్ వ్యాపారాన్ని ఏలూరికి తరలించి అక్కడ కేవలం సినిమా షూటింగ్ లు మాత్రమే జరుగుతాయని కోర్టులో చూపించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నీ రోజులు నడిచి చివరకు తరువాత ఎన్నికల్లో కాంగ్రెస్ వచ్చినప్పుడు అప్పటి సీెంతో మాట్లాడి నాగేశ్వరరావు కేసులు కొట్టేయించుకున్నారు. ఆ వివాదం ఇప్పుడు ముగిసింది అంటూ భరద్వాజ అప్పటి విషయాలను ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేశారు. 

Also Read :  లక్ష్మీపార్వతి ఫొటోను ఎన్టీఆర్ చించేశారా.. ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా.. !

Visitors Are Also Reading