Home » వాస్తవం.. ఖచ్చితత్వం ! మునుగోడులో నిజమైన COPACT సర్వే

వాస్తవం.. ఖచ్చితత్వం ! మునుగోడులో నిజమైన COPACT సర్వే

by Sravan Sunku
Ad

తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్ హీట్ పెంచిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వచ్చేసింది. ఈ ఎన్నికలలో అధికార టిఆర్ఎస్ పార్టీ తన సత్తాని చాటింది. మొదటి 3 రౌండ్లలో బిజెపి ఆదిత్యం కనబరిచినప్పటికీ.. ఈ ఫైట్ లో కేవలం 11,666 ఓట్ల మెజారిటీతో టిఆర్ఎస్ గెలిచి గట్టెక్కింది. అయితే ఈ మునుగోడు ఉపఎన్నిక ఫలితం పై అనేక సర్వే సంస్థలు తమ అంచనాలను ఇచ్చాయి. కానీ ఫలితానికి 95% దగ్గరగా చెప్పింది మాత్రం “COPACT” మాత్రమే. మునుగోడు జనాలు ఏమనుకుంటున్నారు..? మునుగోడులో గెలిచేది ఎవరు..? ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు..? ఏ ఏ అంశాలు ఓటింగ్ సరళిని ప్రభావితం చేయనున్నాయి? ఇలా అనేక ప్రశ్నలతో అక్కడి ప్రజల మనోగతం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసింది “COPACT” సంస్థ.

Advertisement

Advertisement

మునుగోడులో రెండుసార్లు లోతైన సర్వే నిర్వహించింది “COPACT” సంస్థ. మునుగోడు నియోజకవర్గంలోని 7 మండలాలలో, అన్ని ముఖ్యమైన గ్రామాలలో 3000 మంది నుంచి సమాచారం సేకరించింది. పోలింగ్ కి 15 రోజుల ముందు ఒక సర్వే, పోలింగ్కి నాలుగు రోజుల ముందు మరో సర్వే నిర్వహించింది “COPACT” సంస్థ. టిఆర్ఎస్ పార్టీకి 41% ఓట్లు వస్తాయని, బిజెపికి 36% వస్తాయని వెల్లడించింది. “COPACT” చెప్పినట్లుగానే టిఆర్ఎస్ పార్టీకి 42% ఓట్లు వచ్చాయి. “COPACT” చెప్పినట్లుగానే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పై ఘన విజయం సాధించారు. అయితే మండలాల వారిగా ఏఏ మండలాలలో ఏ కారణాల వల్ల.. ఏ ఏ పార్టీకి లాభనష్టాలు ఉంటాయో కూడా “COPACT” సర్వేలో వివరించారు.

 

95% సర్వే వెల్లడించిన విధంగానే ఆయా మండలాల వారి ఫలితాలు ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న “COPACT” రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన సేవలను అందిస్తోంది. 2020లో జిహెచ్ఎంసి ఎన్నికలలో ఒక ప్రధాన పార్టీ తరపున కీలక పాత్ర పోషించింది. అప్పుడు కూడా మంచి ఫలితాలను రాబట్టింది. తాజాగా మునుగోడు లో కూడా “COPACT” బృందాల శాస్త్రీయ పరిశోధన ప్రకారం టిఆర్ఎస్ పార్టీకి 10 నుంచి 12 వేల మెజారిటీ వస్తుందని చెప్పగా.. తుది ఫలితం అలాగే వచ్చింది. మునుగోడులో “COPACT” సర్వే నిజమైంది.

Also Read:  టాలీవుడ్ హీరోల భార్యలు హీరోయిన్ ల కంటే ఎక్కువ సంపాదిస్తారనే విషయం మీకు తెలుసా ?

Visitors Are Also Reading