చరిత్రలో బ్రహ్మం గారి కాలజ్ఞానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే జరిగిపోయాయి. దాంతో బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ప్రాధాన్యత పెరిగిపోయింది. దాదాపు అన్ని గ్రామాలలో బ్రహ్మంగారి ఆలయాలను నిర్మించి ఆయనను దేవుడిలా కొలుస్తున్నారు. ఆయన చెప్పిన వాటిలో ఇప్పటికే ఆవుకు మూడు కాళ్ళ దూడ జన్మించింది. అంతేకాకుండా రెండు తలలతో పిల్లలు పుట్టిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే బ్రహ్మం గారు చెప్పిన వాటిలో చాలా విషయాలు జరిగాయి.
Also Read: సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలకు థియేటర్స్ ఎలా పంచారు ? ఎవరెవరికీ ఎన్ని అంటే ?
Advertisement
ముఖ్యంగా ఎన్టీ రామారావు బ్రహ్మంగారి కాలజ్ఞానం పేరుతో చేసిన సినిమా ద్వారా ఆయన చరిత్ర చాలామందికి తెలిసింది. అంతేకాకుండా ఆయన చెప్పిన చాలా విషయాలను ఈ సినిమాలో చక్కగా వివరించారు. అయితే ఇప్పుడు తాజాగా బ్రహ్మంగారు చెప్పిన మరో విషయం జరిగింది.
Advertisement
Also Read: సినిమాలు వద్దు బాబోయ్ అని అమెరికా వెళ్లిపోయిన వెంకటేష్..మళ్లీ ఎవరివల్ల తిరిగి వచ్చారంటే..?
బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కుక్క కడుపులో మేక పిల్ల జన్మిస్తుందని చెప్పారు. అయితే తాజాగా బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలో సింధు బలియా ప్రాంతంలో విగ్రహి అనే గ్రామంలో ఓ వీధి కుక్క ఎనిమిది పిల్లలకు జన్మనిచ్చింది. అయితే అందులో ఒక పిల్ల చూడ్డానికి చాలా వింతగా కనిపిస్తోంది. ఆ కుక్కపిల్ల పూర్తిగా మేక పోలికలతో జన్మించింది. దాంతో అందరూ దాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మొదట దాన్ని మేక పిల్ల అని భావించిన శంభుదాస్ అనే వ్యక్తి ఇంటికి తీసుకువెళ్లాడు. కానీ అది కుక్క పిల్ల అని తెలిసి చివరికి ఆశ్చర్యపోయాడు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో బ్రహ్మంగారు చెప్పింది మరోసారి జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: సీనియర్ నటి భానుప్రియ కూతురు ఎంత అందంగా ఉందంటే..?