సంతోష్ శోభన్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్. ఈ సినిమాను మేర్లపాక గాంధీ తెరకెక్కించారు. జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఇవాళ విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందో లేదో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సంతోష్ శోభన్ (విప్లవ్) గువ్వ విహారి అనే పేరుతో యూట్యూబ్ ట్రావెలర్‌గా ఫేమస్ అవ్వడానికి అరకు టూర్ ప్లాన్ చేస్తాడు. ఈ టూర్లో అనుకోకుండా ఫరియా అబ్దుల్లా (వసుధ వర్మ) కలుస్తోంది. ఆమె అప్పటికే ఫేమస్ యూట్యూబ్ ట్రావెలర్. ఆమె ప్రేరణతో సంతోష్ శోభన్ యూట్యూబ్ ట్రావెలర్ అవ్వాలనుకుంటాడు. ఆమె కలిసినప్పటి నుంచి సంతోష్ శోభన్ ఆమె వెనుక తిరుగుతుంటాడు. మరో వైపు డీజీపీని చంపడానికి పీపీఎఫ్ పార్టీ ఉద్యమకారులు ప్రయ్నతిస్తుంటారు. అసలు ఈ పీపీఎఫ్ పార్టీకి డీజీపీకి మధ్య గొడవ ఏంటి..? వీరి మధ్యలోకి ఫరియా అబ్దుల్లా సంతోష్ శోభన్ ఎలా ఇరుక్కుపోయారు.? ఎందుకు పీపీఎఫ్ పార్టీ బ్రహ్మన్న(బ్రహ్మాజీ) వీరిని కిడ్నాప్ చేస్తాడు ? చివరికి ఫరియా అబ్దుల్లా-సంతోష్ శోభన్ వారి నుంచి ఎలా తప్పించుకుంటారు ? వీరు ప్రేమలో ఎలా పడుతారనే విషయాలు తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
Advertisement
Also Read : డిసెంబర్లో పెళ్లి పీటలెక్కబోతున్న హీరోయిన్ కియారా అద్వానీ.. వరుడు ఎవరో తెలుసా ?
ప్లస్ :
Advertisement
సంతోష్ శోభన్ గత సినిమాల కంటే ఈ సినిమాలో మంచి కామెడీ టైమింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ప్రధానంగా ఇంటర్వెల్ సీన్స్, కొన్ని సెకండ్ హాఫ్‌లో వచ్చే లవ్ సీక్వెన్స్‌లో కామెడీ సీన్స్ లో కూడా సంతోష్ శోభన్ సెటిల్డ్ పెర్పార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఫరియా అబ్దుల్లా కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు గ్లామర్ తో కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషించిన బ్రహ్మాజీ ఎప్పటి మాదిరిగా అద్భుతంగా నటించారు. బ్రహ్మాజీ కామెడీ టైమింగ్ బాగా వర్కవుట్ అయిందనే చెప్పాలి. మరో కీలక పాత్రలో కనిపించినా సప్తగిరి కూడా ఆకట్టుకున్నారు. సుదర్శన్, నరేన్, మైమ్ గోపి, గోవింద్, పద్మ సూర్య తదితరులు తమ పాత్ర మేరకు ఆకట్టుకున్నారు.
Also Read : రమాప్రభ కూతురిని పెళ్లాడిన టాలీవుడ్ టాప్ హీరో ఎవరో తెలుసా ?
మైనస్ :
సినిమా కొన్ని చోట్ల సాగదీశారు. కామెడీ కోసం కథను నడిపించినట్టు అనిపిస్తోంది. క్లైమాక్స్ లో మెయిన్ విలన్ ట్రాక్ కి సంబంధించి డీటైల్‌గా చూపించి ఉంటే బాగుండేది. ఈ సినిమాలో విలువైన భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలకు అవకాశం ఉన్నా దర్శకుడు మేర్లపాక గాంధీ అప్లై చేయలేకపోయాడు. దానికి తోడు కొన్ని కామెడీ సీన్స్ అంతగా ఆకట్టుకోలేదు.
తీర్పు :
‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ అంటూ పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో స్టార్టింగ్ సీన్స్, సిల్లీ ట్రాక్స్, ఫేక్ ఎమోషన్స్ అండ్ పూర్తి సినిమాటిక్ టోన్ దీనికి తోడు కొన్ని కీలక సీన్స్ స్లోగా సాగడం వంటి అంశాలు కారణంగా సినిమా ఫలితం నెగిటివ్‌గా మారిందనే చెప్పాలి. సంతోష్ శోభన్ నటన, ఫరియా అబ్దుల్లా గ్లామర్, బ్రహ్మాజీ కామెడీ సినిమాలో బాగున్నాయి. మొత్తమ్మీద ఈ సినిమాని థియేటర్లలో ఒకసారి చూడవచ్చు.
Also Read : శ్రీదేవిని పెళ్లి చేసుకోవాల్సిన కమల్ హాసన్.. ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా ?