Home » అఖండ సినిమాలో దుమ్ము రేపిన “జై బాల‌య్య” సాంగ్ లో గ్రాఫిక్స్ వాడారా..?

అఖండ సినిమాలో దుమ్ము రేపిన “జై బాల‌య్య” సాంగ్ లో గ్రాఫిక్స్ వాడారా..?

by AJAY
Ad

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా అఖండ సినిమా జోరుక‌నిపిస్తోంది. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర‌వాత విడుద‌లైన పెద్ద సినిమా మాస్ సినిమా కావ‌డంతో ఈ సినిమాపై ఎన్నో అంచానాలు నెల‌కొన్నాయి. ఇక ఆ అంచనాల‌కు అఖండ రెట్టింపు విజ‌యాన్ని అందుకుంది. ఇప్ప‌టికే ఈ సినిమా భారీ క‌లెక్ష‌న్ల‌తో వంద‌కోట్ల క్ల‌బ్ లో చేరిపోయింది. ఇక ఈ సినిమాల‌తో పాటూ పాట‌లు కూడా సూప‌ర్ హిట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. పాట‌ల‌కు త‌గ్గ‌ట్టుగా బాల‌య్య త‌న స్టెప్పులతో ఇర‌గ‌దీశాడు. ముఖ్యంగా సినిమాలో సూప‌ర్ హిట్ గా నిలిచిన జైబాల‌య్య సాంగ్ ఎక్కువ‌గా వినిపిస్తోంది.

Advertisement

అయితే ఈ పాట‌లో బాల‌య్య నెవ‌ర్ బిఫోర్ స్టెప్పులు వేయించిన కొరియోగ్రాఫ‌ర్ ఎవ‌రా అన్న‌దాన్ని ఇప్పుడు ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా సెర్చ్ చేస్తున్నారు. కాగా ఈ పాట‌కు కిరియోగ్రాఫీ చేసింది భానూ మాస్ట‌ర్. బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ హీరో గా న‌టించిన స‌రైనోడు సినిమాలో డూడూ రారా డూడూ పాట‌కు కూడా భానూ మాస్ట‌ర్ కొరియోగ్రాఫీ చేశారు. ఈ పాట‌కు భానూ వేయించిన స్టెప్పులు బోయ‌పాటికి భాగా న‌చ్చ‌డంతో బాల‌య్య‌తో స్పెప్పులు వేయించే అవ‌కాశం ఇచ్చారు. అంతే కాకుండా ఈ సినిమా ఫంక్ష‌న్ లో భానూ మాస్ట‌ర్ ను బోయ‌పాటి శ్రీను మీడియాకు ప‌రిచ‌యం చేశారు.

Advertisement

also read: ‘భీమ్లా నాయక్’ నుంచి రానా స్పెషల్ వీడియో.. సోషల్ మీడియా షేక్..!

ఈ పాట‌లో బాల‌య్య వేసిన స్టెప్పులతో త‌న లైఫ్ మారిపోయింద‌ని అన్నారు. మూడు రోజుల్లోనే ఈ పాట‌కు కొరియోగ్ర‌ఫీ చేశామ‌ని చెప్పారు. అంతే కాకుండా ఈ పాట‌లో గ్రాఫిక్ లేద‌ని…బాల‌య్య చాలా క‌ష్ట‌ప‌డి చేశార‌ని చెప్పారి. పాట‌లో మూమెంట్లు బోయ‌పాటి డిసైడ్ చేశార‌ని చెప్పారు. అంతే కాకుండా బాల‌య్య‌కు ఎన్ని స్టెప్పులు చెప్పినా ఆయ‌న నో చెప్ప‌లేద‌ని అన్నారు. కొన్ని స్టెప్పులు బాల‌కృష్ణ సింగిల్ షాట్ లో చేశార‌ని చెప్పారు. ష‌ర్ట్ లు వేసే స్టెప్పులు కూడా గ్రాఫిక్స్ లేద‌ని బాల‌య్య నిజంగా చేశార‌ని చెప్పారు.

Visitors Are Also Reading