Home » శివ కేశ‌వుల‌కు ఇష్ట‌మైన కార్తీక మాసంలో చేయ‌కూడ‌నివి ఇవే..!

శివ కేశ‌వుల‌కు ఇష్ట‌మైన కార్తీక మాసంలో చేయ‌కూడ‌నివి ఇవే..!

by Anji
Ad

 

శివ కేశ‌వుల‌కు అత్యంత ఇష్టమైన మాసం కార్తీక మాసం నేటి నుంచే ప్రారంభం అవుతోంది. సాధార‌ణంగా కార్తిక మాసం దీపావ‌ళి త‌రువాత వ‌చ్చే పాడ్య‌మి రోజునే కార్తిక మాసాన్ని ప్రారంభిస్తారు. ఈ ఏడాది కార్తీక మాసం ప్రారంభం విష‌యం కూడా చాలా గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. ముఖ్యంగా ఈ ఏడాది అమ‌వాస్య 24, 25 తేదీల్లో ఉండ‌డం ఒక‌టి అయితే.. దీపావ‌ళి పండుగ‌ను 24వ తేదీనే జ‌రుపుకున్నారు. అక్టోబ‌ర్ 25న సూర్య‌గ్ర‌హ‌ణం ఉండ‌డంతో ఆరోజు పండుగ‌ను జ‌రుపుకోకూడ‌ద‌ని పండితులు తెలిపారు. ఇక నేటి నుంచి కార్తిక మాసం ప్రారంభం.

A

Advertisement

ముఖ్యంగా అన్ని మాసాల కంటే కార్తీక మాసానికే ప్ర‌త్యేక‌త ఉంటుంది. కార్తీక మాసానికి స‌మాన‌మైన మాసం లేదు అని, శ్రీ‌మ‌హావిష్ణువుకి స‌మాన‌మైన దేవుడు లేడు అని, వేదంతో స‌మాన‌మైన శాస్త్రం లేద‌ని, గంగ‌తో స‌మాన‌మైన తీర్థం లేద‌ని స్కంద పురాణంలో చెప్ప‌బ‌డింది. అందుకోస‌మే ఈ మాసానికి ప్రాధాన్య‌త ఎక్కువ‌గా ఇస్తుంటారు. ఆ ప‌ర‌మ శివుడికి కూడా ఈ మాసం చాలా ఇష్టమ‌ట‌. శివ భ‌క్తులు ఈ మాసంలో చాలా భ‌క్తి భావంతో పూజ‌లు చేస్తుంటారు. కార్తీక మాసంలో పూజ‌లు చేస్తే అనుకున్న‌వ‌న్నీ సిద్ధిస్తాయ‌ని, పాపాలు తొలిగిపోయి, మోక్షం క‌లుగుతుంద‌ని చెబుతుంటారు.

Advertisement

Also Read : న‌టి ప్ర‌గ‌తి జీవితంలో ఇంత విషాదం ఉందా..? డ‌బ్బుల్లేక బంగారం తాక‌ట్టుపెట్టి..!

కార్తీక మాసాన్ని శివుడికి, విష్ణువుకి అత్యంత ఇష్ట‌మైన మాసంగా పిలుస్తుంటారు. ఈ నెల‌లో శివకేశ‌వుల‌ను స‌మానంగా ఆరాధిస్తార‌ట‌. ఈ ఏడాది అక్టోబ‌ర్ 26 నుంచి నవంబ‌ర్ 23 వ‌ర‌కు కార్తీక మాసం కొన‌సాగుతుంది. నెల రోజుల పాటు శైవ‌, వైష్ణ‌వ భ‌క్తులు అత్యంత నియ‌మ‌, నిష్ట‌ల‌తో శివ‌కేశ‌వుల‌ను పూజిస్తుంటారు. ప్ర‌ముఖ శైవ క్షేత్రాలు, వైష్ణ‌వ ఆల‌యాలు శివ కేశ‌వుల నామ‌స్మ‌ర‌ణ‌తో మారుమ్రోగిపోతాయి. కార్తీక మాసం నియ‌మాల‌ను పాటించేవారు రోజుకి ఒక పూట మాత్ర‌మే భోజ‌నం చేస్తుంటారు. శాకహారం భుజిస్తుంటారు. ఈ నెల రోజుల పాటు అస‌లు మాంసాహారం జోలికి వెళ్ల‌రు. భ‌గ‌వంతుడిపై అత్యంత భ‌క్తి విశ్వాసాన్ని చూపిస్తూ పూజ‌లు నిర్వ‌హిస్తారు. మంచంపై పడుకోకూడ‌దు. దాన ధ‌ర్మాలు చేయాలి. తెల్ల‌వారుజామున లేచి చ‌న్నీటి స్నానం చేసి పూజ‌లు చేయాలి. న‌ది స్నానాలు చేసి, కార్తీక దీపాల‌ను న‌దుల్లో వ‌దిలి భ‌గ‌వంతుడిపై భ‌క్తిని చాటుకోవాలి.

Also Read : HYD: గ్రాండ్ గా ముస్తాబవుతున్న మహేష్ బాబు హోటల్స్.. పేర్లు బలే ఉన్నాయే..!!

 

Visitors Are Also Reading