చలో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది రష్మిక మందన్న. టాలీవుడ్ లో ప్రస్తుతం ఈ కన్నడ భామ పాగా వేసి నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. ముఖ్యంగా పుష్ప సినిమాతో రష్మిక నేషనల్ క్రష్ గా మారింది. దీపావళి సందర్భంగా రష్మిక తన ఫ్యామిలీ సెంటిమెంట్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించింది. రష్మిక మందన్న గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. రష్మిక మందన్న కన్నడ అందం ఇప్పుడు తెలుగు తో పాటు పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుతోంది. 2020లో నేషనల్ క్రష్ గా ఎంపికైంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాలో శ్రీవల్లిగా అదరగొట్టింది.
రష్మిక రీసెంట్ గా సీతారామం చిత్రంలో పాకిస్తాన్ యువతి పాత్రలో నటించింది. ఆమె నటించిన తొలి హిందీ సినిమా గుడ్ బై ఇటీవల విడుదలైన బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ప్లాప్ అయ్యింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ దీపావళి సెలబ్రేషన్స్ కు సొంతూరుకు వెళ్ళింది ఈ కన్నడ భామ. దీపావళి పండుగ సందర్భంగా సరికొత్త విషయాన్ని తెలియజేసింది కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ పెద్ద పండుగలకు కచ్చితంగా ఇంటికి వెళ్తానంది రష్మిక. ఈ దీపావళి కి సొంత ఊరికి వెళ్లారు.
Advertisement
Advertisement
Also Read : కూతురిని హీరోయిన్ ను చేసేందుకు కృతిశెట్టి తల్లి అంతటి త్యాగం చేసిందా..?
దీపావలి పండగ సందర్భంగా తన ఇంట్లో ఓ సెంటిమెంట్ ఉందని చెప్పింది ఈ బ్యూటీ. ప్రతి ఏడాది దీపావళి పండగ రోజు మా కుటుంబంలో పండగకి ఒక రోజు ముందుగానే బంగారం, వెండి కొంటారని చెప్పింది రష్మిక.ఇలా ప్రతి దీపావళికి ఆభరణాలు కొనడం మా కుటుంబానికి పెద్ద సెంటిమెంట్. అలాగే కొత్త సినిమాలకు ముందు కూడా బంగారం, వెండి ఆభరణాలు కొనటం మా ఫ్యామిలీకి ఒక సెంటిమెంట్ అంటూ సరికొత్త విషయాలు చెప్పింది రష్మిక. దీంతోపాటు మరో ఆసక్తికరమైన విషయం అభిమానులతో పంచుకుంది. తన ఇంట్లో రష్మిక, చెల్లి నాన్న రష్మికను ‘మహాలక్ష్మి’ అని పిలుస్తారట ఇలా పిలిచేటప్పుడల్లా తనకు చాలా గర్వంగా ఉంటుందని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
Also Read : వీర సింహారెడ్డి నుండి బాలయ్య డైలాగ్ లీక్…ఫ్యాన్స్ కు పూనకాలే…!