సాధారణంగా చిన్న పెద్ద తేడా లేకుండా కలిసిమెలిసి ఆనందంగా జరుపుకునే పండుగలలో దీపావళి పండుగ ఒకటి. దీపావళి పండుగ అనగానే గుర్తుకొచ్చేది టపాసులు, దీపాలు వెలిగించడం అందరూ చేస్తుంటారు. కానీ ఈ దీపావళి పండుగ గురించి పురాణ గాథలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం.. చీకటి నిరాశ నిస్పృహలకు, అజ్ఞానానికి గుర్తు దీపావళి. అజ్ఞానం అనే చీకటి నుంచి విజ్ఞానపు వెలుగుల్లో పయనించి జీవితంలో కొత్త అర్థాలు వెతుక్కోవాలని చెప్పడమే దీపావళి పండుగ ఉద్దేశం. దీపం ఉన్నచోట జ్ఞాన సంపద ఉంటుంది. దీపము సాక్షాత్తు లక్ష్మీదేవి అని పురాణాలు పేర్కొంటున్నాయి. సనాతన ధర్మంలో ఏ శుభకార్యము జరిగినా కూడా వెలిగించడం సంప్రదాయము. దీప కాంతిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో తెలియజేసింది శాస్త్రం. దీపంలో కనిపించే ఎర్రని కాంతి బ్రహ్మదేవునిగా, శాంతి విష్ణు భగవానుడిగా, తెల్లని కాంతి పరమశివునికి ప్రతినిధులుగా చెబుతుంటారు. ఆశ్రయుజ మాసం అమావాస్య స్వాతి నక్షత్రంతో కూడిన రోజు ను తెలియజేస్తారు. దీపావళి కి సంబంధించి పురాణాల ప్రకారం నాలుగు కథలు ఉన్నాయి.
Advertisement
Advertisement
- రావణాసురుడితో జరిగిన యుద్ధంతో సాధించిన శ్రీరామచంద్రుడు సమేతంగా అయోధ్యకు విచ్చేసినటువంటి ఆశ్వయుజ మాసము అమావాస్య అని రామాయణం పేర్కొంది. ఓకే ఈరోజు దీపాలను వెలిగించి సీతారాములకు స్వాగతం పలికినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి.
- నరకాసురుని సంహరించిన తర్వాత ఆ రాక్షసుడి పీడ విరగడైపోవడంతో ప్రజలంతా ఈ అమావాస్య రోజు దీపాలను వెలిగించి పండుగలా జరుపుకుంటున్నారని.. నేటికీ ఇది కొనసాగుతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి.
Also Read : దీపావళి రోజు పెద్దవారు పిల్లలతో దివిటిని ఎందుకు కొట్టిస్తారో తెలుసా..?
- సముద్రం నుంచి లక్ష్మీదేవి దీపావళి రోజునే ఉద్భవించినట్టు చెబుతుంటారు. అష్ట, ఐశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని రోజు సాయంత్రం పూజించడం ఎంతో విశేషంగా భావిస్తారు.
- మహాభారతంలో కౌరవులు సాగించిన ఆయా జూదం లో ఓడిన పాండవులు అరణ్య వాసం, అజ్ఞాతవాసం పూర్తిచేసుకుని తిరిగి తమ రాజ్యానికి వచ్చినటువంటి రోజును దీపావళిగా తెలియజేస్తారు. పురాణాల కథల ప్రకారం ప్రాధాన్యత గురించి మనకు స్పష్టంగా అర్థం అవుతోంది.
Also Read : Happy Diwali (Deepavali) Wishes, quotes, Greetings, Images in Telugu, దీపావళి శుభాకాంక్షలు 2022