Home » దీపావళి రోజు పెద్దవారు పిల్లలతో దివిటిని ఎందుకు కొట్టిస్తారో తెలుసా..?

దీపావళి రోజు పెద్దవారు పిల్లలతో దివిటిని ఎందుకు కొట్టిస్తారో తెలుసా..?

by Anji
Ad

దీపావళి పండుగ అంటే మనలో ఉన్న అజ్ఞానం పోయి జ్ఞాన జ్యోతిని వెలిగించడమే దీపావళి పండగ. నరక చతుర్దశి రోజు పూజలు చేసి దీపాలను వెలిగించాలి. అలా చేస్తే పితృదేవతలు స్వర్గానికి చేరుతారు. దీపావళి రోజు పితృ దేవతల సంధ్యా సమయాన ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి తమ సంతానాల గృహాలను చూస్తారట. వారికి దారి కనిపించడం కోసమే దివ్వెలు కొట్టే సంప్రదాయం ఏర్పడింది. పెద్దవారు పిల్లలతో ఈ దివిటీని కొట్టిస్తారు. పొడుగాటి గోంగూర కాడలు నూనెతో తడిపిన బట్టతో కట్టి వాటిని పిల్లల చేతికి ఇచ్చి వారిని వీరి గుమ్మం ముందు నిలబెట్టి దివిటీలు వెలిగించి ఆకాశంలో దక్షిణ వైపు చూపిస్తూ గుండ్రంగా మూడుసార్లు తిప్పుతారు.

 

Advertisement

దివిటీని నేలకు వేసి కొట్టిస్తూ దుబ్బు దుబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగులచవితి అని అనిపిస్తారు. ఆ తర్వాత ఆ కాడలను ఒక పక్కగా పడేస్తారు. పిల్లల కాళ్లు చేతులు కడిగి తుడిచి చేతితో నోరు శుభ్రం చేసుకోండి అని చెబుతారు. ఆ తర్వాత పిల్లలకు నోట్లో మిఠాయిలు పెట్టి తినిపిస్తారు. తర్వాత ఇంట్లోని అందరూ టపాకాయలు కాలుస్తూ సంబరాలు పూర్తయ్యాక అర్ధరాత్రి దాటాక ఇల్లు వాకిలి తుడుచుకోవాలి అని ధర్మశాస్త్రం చెబుతోంది. పండుగ నాడు ఇంటి గుమ్మాలకు మామిడాకుల తోరణాలు బంతిపూల మాలలు కడతారు. పెద్ద పెద్ద ముగ్గులు వేసి మధ్యలో పసుపు కుంకుమలతో పూలతో అలంకరించి దీపాలు పెడతారు. దేవుని దగ్గర తులసి కోట దగ్గర ఇరువైపుల దీపపు ప్రమిదలు పెడతారు.

Advertisement

Also Read :  Chanakya Niti : ఈ విషయాలను ఎవరితో కూడా పంచుకోకూడదు.. మీకే ప్రమాదం..!

 

మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ నెయ్యి వేసి వత్తులు వేసి వెలిగించిన తరువాత దీపాలను వరుసగా ఇంటి ముందర గోడల మీద డాబాల మీద పెడతారు. కొన్ని ప్రాంతాలలో బాణాసంచా కాల్చి ఇంట్లోకి వచ్చాక ఆడవాళ్ళు అందరూ కలిసి చేటలు పళ్ళాలు వాయిస్తారు. అది దరిద్ర దేవత తరిమివేసినట్లు అవుతుంది. దీపావళి పండగ ముందు అనేక రకాలైన మిఠాయిలు చేసుకొని దీపావళి నాడు ఇంట్లో వండిన పులిహోర గారెలు బూరెలు లాంటివి ఇరుగుపొరుగు వారికి ఇచ్చి బంధువులతో కలిసి భోజనం చేద్దాం. దీపావళి పండుగకు రెండు రోజుల ముందు ధన త్రయోదశిని తర్వాత నరక చతుర్దశి అమావాస్య రోజు దీపావళి ఆ తర్వాత రోజు బలి పాడ్యమి ఆ మరుసటి రోజు భగిని హస్తభోజనం లేక అన్ని వరుసగా ఐదు రోజుల పండుగ చేసుకుంటాం.

Also Read :  ఇలాంటి పండ్లు తింటే అసలు పిల్లలే పుట్టరట

Visitors Are Also Reading