Home » టాబ్లెట్స్ వాటితో ఎందుకు తీసుకోకూడదో తెలుసా..?

టాబ్లెట్స్ వాటితో ఎందుకు తీసుకోకూడదో తెలుసా..?

by Bunty
Ad

గోరువెచ్చని పాలతో మందులు వాడాలని ప‌లువురు త‌రుచుగా అంటుంటారు. దీని ద్వారా మందులు మెరుగ్గా పనిచేస్తాయని, వాటి ప్రభావం మారుతుందని వారు నమ్ముతారు. సైన్స్ దీనిని అంగీకరించదు. చాలా సార్లు రోగులు టీ, పాలు, జ్యూస్‌తో కూడిన మందులను తీసుకుంటే, అవి మందుల ప్రభావాన్ని తిప్పికొడతాయని నిపుణులు అంటున్నారు. పాలు.. ఇతర జ్యూస్ లతో మందులు ఎందుకు తీసుకోకూడదు? అదేవిధంగా టాబ్లెట్స్ రేపర్ పై ఉండే ఎర్రటి గీత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా పాలతో మందులు ఎందుకు తీసుకోకూడదో తెలుసుకుందాం. జ్యూస్, పాలు వంటి పానీయాలు ఔషధ ప్రభావాన్ని తగ్గించగలవని జర్మన్ అసోసియేషన్ ఆఫ్ ఫార్మసిస్ట్ ప్రతినిధి ఉర్సులా సెల్లర్‌బర్గ్ చెప్పారు. ఇలా ఆలోచించండి. పాలలో కాల్షియం ఉంటుంది. ఇది మెడిసిన్ లో ఉన్న ఔషధం రక్తంలోకి రాకుండా చేస్తుంది. అందువలన, ఆ మెడిసిన్ ప్రభావం తగ్గుతుంది. ఉర్సులా సెల్లెర్‌బర్గ్ మాట్లాడుతూ.., కొంతమంది జ్యూస్‌తో మందులు తీసుకుంటారు. ఇలా అసలు చేయవద్దు. జ్యూస్ శరీరానికి చేరుకుంటుంది. మెడిసిన్ శరీరంలో కరిగిపోవడానికి సహాయపడే ఎంజైమ్‌ను నిరోధిస్తుంది. అందువలన, ఔషధం ప్రభావం కూడా తక్కువగా ఉండవచ్చు. లేదా మనం తీసుకున్న ఆ మెడిసిన్ దాని ప్రభావాన్ని ఆలస్యంగా చూపించవచ్చు. అందువల్ల, నీటితో మందులు తీసుకోవడం మంచి మార్గం.

Advertisement

Advertisement

 

మెడిసిన్ స్ట్రిప్ మీద అంటే టాబ్లెట్స్ ప్యాకింగ్ పై ఎర్రటి గీత ఉంటుంది. ఇది ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం. ఎరుపు గీత ఎక్కువగా యాంటీబయాటిక్.. కొన్ని ఇతర మేదిసిన్స్ స్త్రిప్స్ మీద కనిపిస్తుంది. ఈ లైన్ అంటే, ఈ మెడిసిన్ డాక్టర్ సలహా లేదా ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేయకూడదు. ఇది మన స్వంత ఇష్టానుసారం ఉపయోగించకూడదు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరికను కూడా జారీ చేసింది. ఖాళీ కడుపుతో మందులు తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనికి అతి పెద్ద కారణాలలో ఒకటి కడుపులో మంట. కొన్ని మందులు.. ఖాళీ కడుపుతో తీసుకుంటే, కడుపుకు సంబంధించిన అనేక సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి ఖాళీ కడుపుతో వాటిని తీసుకోకుండా ఉండండి. ఇది కాకుండా, మందులు ఎప్పుడూ ప్రిస్క్రిప్షన్ ప్రకారం తీసుకోవాలి.

 

Visitors Are Also Reading