Home » ప‌వ‌న్ క‌ల్యాణ్ 3 పెళ్లిళ్ల‌పై సీఎం జ‌గ‌న్ కౌంట‌ర్..? వామ్మో అలా అన్నాడేంటి…?

ప‌వ‌న్ క‌ల్యాణ్ 3 పెళ్లిళ్ల‌పై సీఎం జ‌గ‌న్ కౌంట‌ర్..? వామ్మో అలా అన్నాడేంటి…?

by AJAY

జ‌న‌సేన అధినేత‌ పవన్ కళ్యాణ్ ఇటీవల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సర్కార్ పై నేతలపై విమర్శలు కురిపించారు. గతంలో పవన్ కళ్యాణ్ ఆ రేంజ్ లో ఎప్పుడూ ఫైర్ అవ్వలేదు అనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి కౌంటర్లు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో… మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను మీరు కూడా చేసుకోండి కొడ‌క‌ల్లారా అంటూ ఫైర్ అయ్యారు.

ఆ తర్వాత భరణాలు ఇవ్వండి అని వ్యాఖ్యానించారు. విడాకులు ఇచ్చిన తర్వాతే తను మూడో పెళ్లి చేసుకున్నానని పవన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఒకే పెళ్లి చేసుకుని ముప్పై మంది తో తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటూ విమర్శించారు. అక్కడితో ఆగకుండా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో చెప్పులు చూపిస్తూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే పవన్ వ్యాఖ్యలపై తాజాగా ఏపీ సీఎం జగన్ స్పందించారు.

Ap cm jagan

Ap cm jagan

సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ…. కొందరు చెప్పులు చూపిస్తూ దారుణమైన‌ బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. అందరికీ మేలు జరుగుతుందని చెబితే మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారంటూ పవన్ పై జగన్ ఫైర్ అయ్యారు. నాలుగైదు పెళ్లిళ్లు చేసుకుని కాపురం చేసి ఎంతో కొంత ఇచ్చి విడాకులు తీసుకోవ‌డం మొద‌లు పెడితే వ్యవస్థ ఏం బతుకుతుంది అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆడవాళ్ళ మాన‌ ప్రాణాలు ఏం కావాలి ఒకసారి ఆలోచన చేయండి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై జగన్ ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు. ఇప్పటికే పవన్ స్పీచ్ పై పేర్ని నాని ఎమ్మెల్యే రోజా కొడాలి నాని సైతం ఫైర్ అయిన సంగతి తెలిసిందే మరి సీఎం జగన్ చేసిన కామెంట్లపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Visitors Are Also Reading