Home » కొత్త‌గా పెళ్లైన ఆడ‌పిల్ల త‌ల్లికి రాసిన ఉత్త‌రం..చ‌దివితే క‌న్నీళ్లు పెట్ట‌కుండా ఉండ‌లేరు..!

కొత్త‌గా పెళ్లైన ఆడ‌పిల్ల త‌ల్లికి రాసిన ఉత్త‌రం..చ‌దివితే క‌న్నీళ్లు పెట్ట‌కుండా ఉండ‌లేరు..!

by AJAY
Ad

పెళ్లి తరవాత అమ్మాయి అత్తవారింటికి వెళ్ళడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. అయితే అలా వెళ్లేటప్పుడు తను పుట్టిన ఇళ్లను కన్నవారిని తోపుట్టులను విడిచి పెట్టి వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో అమ్మాయిలు..ఆమె కుటుంబం స‌భ్యులు ఎంత బాధపడతారో మాట‌ల్లో చెప్ప‌లేం. కాగా ఇక్క‌డ ఓ అమ్మాయి పుట్టింటిని విడిచి అత్తింట్లో అడుగుపెట్టిన త‌ర‌వాత త‌న తల్లికి ఓ లేఖ రాసింది. ఆ లేఖ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ లేఖ‌లో ఏం రాసిందో ఇప్పుడు చూద్దాం….

Advertisement

అమ్మ అందరు ఆడపిల్లల్లానే నేను కూడా పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నాను. ఒక రాకుమారుడు నాకోసం వస్తాడని జీవితం అంతా అతనితో సంతోషంగా గడపాలని ఊహించుకున్నాను. కానీ ఈ రోజు నా పెళ్లి జరిగిన తర్వాత నాకు తెలిసింది. పెళ్లి అంటే పూలపాన్పు కాదని. నేను ఊహించిన దానికన్నా ఇక్కడ భిన్నంగా ఉంది. నాకోసం నా వంతు బాధ్యతలు.. పనులు, త్యాగాలు, రాజీలు ఎన్నో ఇక్కడ వేచి చూస్తున్నాయి. నా ఇష్టం వచ్చినప్పుడు నేను నిద్రలేవలేను.

నేను ఇంట్లో అందరికన్నా ముందు లేచి వాళ్లకు కావాల్సినవన్నీ సిద్ధం చేయాలని ఆశిస్తారు. మన ఇంట్లో మాదిరిగా పైజామాలతో రోజంతా ఇల్లంతా తిరగలేను. ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని పద్ధతుల ప్రకారం నడుచుకోవాలి. ప్రతిక్షణం అందరి పిలుపులకి స్పందించాలి. వాళ్ల‌కు కావలసినవన్నీ సిద్ధం చేయాలని ఆశిస్తారు. ఇక్కడ నాకంటూ ఉండే కొన్ని ఇష్టాల‌ను చంపుకోవాలి. నాకు ఇష్టం వచ్చినప్పుడు బయటకు వెళ్లలేను. అందరి అవసరాలు తీర్చడం నా చేతిలోనే ఉంది. మీ దగ్గర ఉన్నప్పుడు పడుకున్నట్టు నా ఇష్టం వచ్చిన పుడు నేను పడుకోవడానికి వీలు లేదు. నేను ప్రతిక్షణం హుషారుగా ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏం కావాలన్నా చేసి పెట్టాలి.

Advertisement

నన్ను యువరాణి లాగా శ్రద్ధ తీసుకునే వారు ఇక్కడ లేరు. కానీ అందరి గురించి నేనే శ్రద్ధ తీసుకోవాలి. ఒక్కోసారి నీ దగ్గరే హ్యాపీగా ఉండక ఎందుకుపెళ్లి చేసుకున్నాను అని ఏడుపు వస్తుంది. ఒక్కోసారి మళ్లీ నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర గారాబంగా పెర‌గాల‌ని ఉంది. మన ఇంటికి వచ్చేసి నాకు ఇష్టమైనవన్నీ నీ చేత వండించుకోవాలని ఉంది. నా స్నేహితులతో ప్రతిరోజు సాయంత్రం బయటకు వెళ్లాలని ఉంది. ప్రపంచంలో నాకు ఇక ఏ బాధలు లేనట్టు నీ ఒడిలో తల పెట్టుకుని పడుకోవాలని ఉంది. కానీ అప్పుడే నాకు గుర్తొస్తుంది.. నువ్వు కూడా ఇలా పెళ్లి చేసుకుని ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వచ్చిన దానివే. నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసి ఉంటావు. నువ్వు ఎలాగైతే గొప్ప సుఖాన్ని.. శాంతిని, సౌకర్యాలను మాకు అందించావో అలాంటి వాటినే నేను అడుగుపెట్టిన నా ఇంటికి కూడా ఇవ్వాలి అని గుర్తొస్తుంది. నేను చెప్తున్నానమ్మా కొంతకాలం గడిచేటప్పటికీ నేను కూడా నీలానే ఈ కొత్త కుటుంబాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను. నువ్వు నీ జీవితంలో మాకోసం చేసిన త్యాగాలకు, రాజీలకు నా కృతజ్ఞతలు… అవి నా బాధ్యతలు సక్రమంగా నెర‌వేర్చడానికి నాకు కావాల్సినంత శక్తిని ధైర్యాన్ని ఇచ్చాయి. లవ్ యూ అమ్మా థాంక్యూ అండ్ మిస్ యూ సో మచ్.

Visitors Are Also Reading