నటీనటులు : రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిషోర్, ప్రమోద్ శెట్టి, ఉగ్రం రవి,అచ్యుత్ కుమార్, తదితరులు
నిర్మాణం : హొంబాళే ఫిల్మ్స్
Advertisement
దర్శకత్వం : రిషబ్ శెట్టి
సినిమాటోగ్రాఫర్ : అరవింద్ కశ్యప్
సంగీతం : అజనీష్ లోకనాథ్
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి విడుదలైన మరో చిత్రరాజం “కాంతార”. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది సినిమా అభిమానులను ఆకట్టుకున్న ఈ చిత్రం గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగులో అనువదించి విడుదల చేసింది.. కానీ మూవీ భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల సినీ వర్గాలను అలరిస్తుందని చెప్పవచ్చు..
also read:ఆదిపురుష్ యానిమేషన్ సినిమా..!
Advertisement
కథ : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు రాజుకు సకల సౌకర్యాలు ఉన్నా కానీ ఏదో తెలియని లోటుతో తరచూ మధన పడతాడు. ఎలాగైనా ప్రశాంతంగా ఉండాలని వెతుక్కుంటూ ప్రయాణిస్తున్న సమయంలో ఒక అడవిలో ఒక శిల వద్ద ఆగిపోతాడు. అక్కడే ఏదో తెలియని ఆనందం. అతని మనసులో ఉన్న అలజడి అంతా పోయి సంతోషం వెల్లివిరుస్తుంది.. వెంటనే ఆ శిలను తనకు కావాలని ఆ గ్రామానికి సంబంధించిన గ్రామస్తులను అడుగుతాడు. దాని కోసం ఎంత కావాలో అడగండి అని వారికి చెబుతాడు.. దీంతో ఆ శిలకు బదులుగా.. ఆడవి మొత్తాన్ని ప్రజలకు ఇచ్చేయాలని, మళ్లీ దాన్ని లాక్కో కూడదని మాట తీసుకుంటాడు మనిషికి పుట్టిన దేవుడు. కట్ చేస్తే.. 1990 సదరు భూమిని రాజు కుటుంబం సొంతం చేసుకోవడానికి మళ్లీ ప్రయత్నాలు మొదలు పెడుతుంది.. దాన్ని ఆ దేవుడు ఎలా అడ్డుకున్నాడు అనేది “కాంతార” కథ.
విశ్లేషణ :
మన మూలాలను మనం మరువకూడదని, అస్తిత్వాన్ని కోల్పోకూడదనే విషయాన్ని ఈ కాంతార చిత్రంలో చాలా అద్భుతంగా చూపించారు. అజనీష్ లోక్నాథ్ సంగీతం.. రిషబ్ నటన దర్శకత్వం, భూత కోలా ఎపిసోడ్స్ వేరే లెవెల్.. ఇక చివరి 20 నిమిషాలు మాత్రం కాంతార చిత్రాన్ని థియేటర్ లో ఎన్ని సార్లు చూసినా పర్లేదు అనిపించే విధంగా ఉంది. ప్రతి ఒక్క సినీ అభిమాని తప్పకుండా థియేటర్లో చూడాల్సిన చిత్రం కాంతార..
రేటింగ్:4/5
also read: