ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు, మెగాస్టార్ చిరంజీవి వివాదంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి స్పందించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ప్రెస్ మీట్‌లో వివాదంపై మాట్లాడారు. ముఖ్యంగా గరికపాటి నరసింహారావు పేరును తన ట్వీట్లలో రకరకాలుగా ప్రస్తావించడాన్ని మీడియా ప్రశ్నించగా.. అసలు ఆయన ఒరిజినల్ పేరు తనకు తెలీదని, అలా ప్రస్తావించానని ఎప్పటి మాదిరిగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. సద్దుమణిగిపోతున్న వివాదానికి ట్వీట్లతో మీరు ఎందుకు ఆజ్యం పోశారని అడగ్గా తనకు సమాచారం ఆలస్యంగా వచ్చిందని అందుకే సమయంలో స్పందిచారని వివరణ ఇచ్చారు.
Advertisement
నాగబాబు ట్వీట్ ను సైతం రీట్విట్ చేశారు కదా అని ఓ పాత్రికేయుడు అడగ్గా.. నా పాయింట్‌లో చిరంజీవి రాష్ట్రానికి సంబంధించిన ఆస్తి అని, ఒక ఫ్యామిలీకి సంబంధించిన వారు కాదు. అందుకు అని నాగబాబు క్షమించొచ్చు. అది ఆయన పర్సనల్ ఒపీనియన్. మేం మాత్రం క్షమించమని ట్వీట్‌లో చెప్పాను అని మరోసారి వర్మ కుండబద్ధలు కొట్టారు. ప్రెస్‌మీట్‌లో వర్మతో పాటు పాల్గొన్న నిర్మాత నట్టి కుమార్ ఈ అంశంపై స్పందిస్తూ.. గరికపాటి నరసింహారావు చిరంజీవికి క్షమాపణ లేఖ పంపారని అంటున్నారని, అలాంటి ఒక లేఖను సోషల్ మీడియాలో చూశానని అన్నారు. అది నిజమో కాదో తనకు తెలీదన్నారు. ఏది ఏమైనా ఆ సమయంలో చిరంజీవిని గరికపాటి నరసింహారావు ఆ మాట అనకూడదని నట్టి కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Advertisement
Also Read : నయనతార సరోగసి ద్వారా పిల్లల్ని కనాలి అని ఎందుకు అనుకున్నారంటే ? వెనక పెద్ద స్టోరీ నే ఉంది !
గరికపాటి నరసింహారావును మెగా అభిమానులు ఏమి అనవద్దంటూ నాగబాబు చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఐయాం సారి నాగబాబు.. మెగాస్టార్‌ని అవమానించిన గుర్రంపాటిని క్షమించే ప్రసక్తే లేదు.. మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రకతో సమానం, త్తగ్గేదెలె అని పేర్కొన్నారు. హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కానీ పబ్లిసిటీ కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు. మెగాస్టర్ చిరంజీవి ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందనుకుంటున్నావు. నువ్వే తెలుసుకో అని ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్లు చూసిన గరికపాటి అభిమానులు వర్మను తిట్టిపోశారు. నరసింహారావునఅనేంతవాడివా నువ్వు, నీకు అంత అర్హత లేదంటూ దుయ్యబట్టారు.
Also Read : టాలీవుడ్ లోకి బాగ్య శ్రీ ఎంట్రి.. హీరో ఎవరో తెలుసా ?