Home » టాలీవుడ్ లోకి బాగ్య శ్రీ ఎంట్రి.. హీరో ఎవ‌రో తెలుసా ?

టాలీవుడ్ లోకి బాగ్య శ్రీ ఎంట్రి.. హీరో ఎవ‌రో తెలుసా ?

by Anji
Ad

న‌టి భాగ్య శ్రీ గురించి చాలా త‌క్కువ మందికే తెలుసు. ఈమె మైనే ప్యార్ కియా సినిమాతో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది బాగ్య శ్రీ. తెలుగులో ప్రేమ పావురాలు పేరుతో విడుద‌లైన ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ నిలిచింది. ఈ సినిమాలో ఆమె అందం, అభిన‌యానికి అంద‌రూ ముగ్ధులైపోయారు. వ‌న్ ఫిల్మ్ వండ‌ర్‌లా ఆమె కేవ‌లం ఒక్క సినిమాకే పరిమిత‌మైంది. ఆ త‌రువాత బాల‌కృష్ణ న‌టించిన యువ‌ర‌త్న రాణాతో పాటు కొన్ని క‌న్న‌డ‌, త‌మిళ్‌, బెంగాలీ సినిమాల్లో న‌టించినా అవ‌న్నీ పూర్తి స్థాయి పాత్ర‌లు కాదు. పెళ్లి చేసుకుని ఇంటికే ప‌రిమిత‌మైన భాగ్య‌శ్రీ చాలా ఏళ్ల త‌రువాత రాధేశ్యామ్‌తో రీ ఎంట్రీ ఇచ్చారు.

Also Read : నయనతార సరోగసి ద్వారా పిల్లల్ని కనాలి అని ఎందుకు అనుకున్నారంటే ? వెనక పెద్ద స్టోరీ నే ఉంది !

Advertisement


ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ఈ చిత్రం అంత‌గా ఆక‌ట్టుకోలేదు. అంత‌కు ముందు కంగ‌నా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన త‌లైవీలో మెరిసింది. ఇదిలా ఉంటే.. భాగ్య శ్రీ కుమారుడు, కూతురు కూడా త‌ల్లి అడుగుజాడ‌ల్లోనే న‌డుస్తున్నారు. ఇప్ప‌టికే కుమారుడు అభిమ‌న్యు దుస్సాని బాలీవుడ్ లో న‌టుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. కుమార్తె అవంతిక దుస్సానీ కూడా మిత్యా వెబ్ సిరీస్‌తో వెండి తెర‌కు ప‌రిచ‌య‌మైంది. ఇప్పుడు ముద్దుగుమ్మ టాలీవుడ్‌లోకి ఎంట‌ర్ అవుతోంది. ఇటీవ‌ల స్వాతిముత్యంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ గ‌ణేష్‌. ఆ త‌రువాత చిత్రం నేను స్టూడెంట్ సార్. ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు తేజ శిష్యుడైన రాఖీ ఉప్ప‌ల‌పాటి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అవంతిక ఎంపిక అయింది.

Advertisement

Also Read : మరో సారి సమంత లవ్ లో ఉన్నారా ? సమంత ఇచ్చిన ఈ హింట్ చూసారా ?

ఇందులో ఆమె శృతి వాసుదేవ‌న్ అనే విద్యార్థినిగా న‌టిస్తోంది. ఇటీవ‌లే ఆమెకు సంబంధించి ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేశారు. ఎంతో స్టైలిష్ అండ్ క్యూట్‌గా ఉన్న ఈ పోస్ట‌ర్‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ చిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శకుడు కృష్ణ చైత‌న్య క‌థ అందిస్తున్నారు. స‌ముద్ర‌ఖ‌ని, సునిల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ కుమారు మ‌హతి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూర్చుతున్నారు. నిత్ మ‌ధాడి డీవోపీగా, చోటా కే ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. క‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి ఈ సినిమాకి డైలాగ్స్ అందిస్తున్నారు. ఎస్‌వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్న ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రం విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌నున్నారు.

Also Read : మెగా హీరోలతో కానిది, నందమూరి హీరోలు చేస్తున్నారా..సెంటిమెంట్ ఏంటంటే..?

 

Visitors Are Also Reading