సాధారణంగా భూమి వెలుపల ఏదైనా జీవం ఉందా అనే ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. మార్స్‌పై అన్వేషణ నిరంతరం కొనసాగుతుంది. అంతేకాదు.. చంద్రునిపై కొత్తగా ఏదైనా చేసే అవకాశాలను కూడా శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా 2025 నాటికి చంద్రుడిపై మొక్కలు పెంచుతామని ఆస్ట్రేలియాకి చెందిన పరిశోధకులు తెలిపారు.
Advertisement
లూనారియా వన్ అనే ఆస్ట్రేలియన్ స్టార్టప్ చంద్రునిపై మొక్కలను పెంచే ప్రణాళికలను ప్రకటించింది. చంద్రుని ఉపరితంపై మొక్కల జీవితం వృద్ది చెందుతుందా లేదా అనేది పరిశోధించడానికి తన ప్రాజెక్ట్‌ని ప్రారంభించింది. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ లో అసోసియేట్ ప్రొఫెసర్ కంపెనీ సైన్స్ సలహాదారు కైట్లిన్ బేయర్ట్ మాట్లాడుతూ.. మొక్కల అంకురోత్పత్తి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే అవకాశం ఈ మిషన్ అన్నారు. ప్రాజెక్ట్ కోసం మొక్కలు ఎంత త్వరగా మొలకెత్తుతాయి. చెడు పరిస్థితుల్లో ఎంత తట్టుకోగలవు అనే దాని ఆధారంగా ఎంపిక చేయబడుతాయి. పరిశోధన స్థిరమైన ఆహార ఉత్పత్తికి కొత్త పద్దతులను తెరుస్తోందని, ఆహార భద్రతను ప్రోత్సహిస్తుందని బృందం భావిస్తోంది.
Advertisement
‘చంద్రునిపై మొక్కలను పెంచడానికి ఒక వ్యవస్థను నిర్మించగలిగితే భూమిపై అత్యంత సవాలుగా ఉన్న కొన్ని వాతావరణాల్లో ఆహారాన్ని పెంచే వ్యవస్థను నిర్మించవచ్చుస అని బేయర్ట్ చెప్పారు. డీ హైడ్రేట్ చేయబడిన నిద్రాణమైన విత్తనాలు, మొక్కలు ప్రత్యేకంగా రూపొందించిన గది ద్వారా పంపబడుతాయి. దీనిని పంపడానికి బెరెషీట్ 2 అంతరిక్ష నౌక సహాయం తీసుకోబడుతుంది. ఇది ఇజ్రాయెలీ మూన్ మిషన్. చంద్రునిపై దిగిన తరువాత అవి మొలకెత్తుతాయి. నీటిద్వారా మరోసారి యాక్టివ్‌గా మారుతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉంచిన డేటాతో వాటి పెరుగుదల, ఆరోగ్యం 72 గంటల పాటు పర్యవేక్షించబడుతుంది.
Also Read : ఆల్కహాల్ తీసుకునేటప్పుడు ఈ పదార్థాలను అస్సలు తినకూడదట..!