భారత్ లో తయారయ్యే ఈ చిన్న పిల్లల దగ్గు మందు ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్వో ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబీయాలో 66 మంది చిన్నారుల మరణాలకు ఒక భారత కంపెనీ తయారు చేసిన దగ్గు మందులకు సంబంధం ఉండవచ్చని డబ్ల్యూహెచ్వో తెలియజేసింది. ఈ మందులు వాడటం వల్ల పిల్లల్లో కిడ్నీ సమస్యలు తలెత్తి వారు చనిపోయి ఉండవచ్చునని అన్నది. డబ్ల్యూహెచ్వో ప్రతిపాదించిన ఈ దగ్గు మందుల జాబితాలో..
also read:జబర్దస్త్ ను రాఘవ వదలకపోవడానికి అసలు కారణం ఇదే..!
Advertisement
-ప్రోమోథాజైన్ ఓరల్ సొల్యూషన్
– కోఫెక్సమాలిన్ బేబీ కాఫ్ సిరప్..
– మెకాఫ్ బేబీ కాఫ్ సిరప్..
– మ్యాగ్రిప్ ఎన్ కోల్ సిరప్.. ఉన్నాయి..
Advertisement
భారతదేశానికి చెందిన మైడెన్ ఫార్మాస్యుటీకల్ ఈ సిరఫ్ ను తయారు చేసిందనీ డబ్ల్యూహెచ్వో తెలియజేస్తోంది. వీటిని గాంబియాలో పిల్లలకు వాడినట్లు గుర్తించారు. అనధికార మార్కెట్ ద్వారా ఇవి అక్కడికి చేరి ఉండవచ్చని WHO వారి వెబ్సైట్ లో పేర్కొంది. వీటిని వాడితే పిల్లల్లో తీవ్రమైన కిడ్నీ సమస్యలు లేదంటే పిల్లలు చనిపోవచ్చు అని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. గత జూలైలో 5 సంవత్సరాల లోపు పిల్లల్లో కిడ్నీ సమస్యలు పెరిగినట్లు గాంబియా అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత డబ్ల్యూహెచ్వో ఈ హెచ్చరికలు జారీ చేసింది.
also read: