టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా రాణించిన వారిలో శోభన్ బాబు కూడా ఒకరు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించిన శోభన్ బాబు అభిమానులను సంపాదించుకున్నారు. ఒకప్పటి స్టార్ హీరోలో ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్నార్ లాంటి హీరోలకు శోభన్ బాబు పోటీగా నిలిచారు. శోభన్ బాబు సినిమాలను ఎక్కువగా మహిళలు ఇష్టపడేవారు. ఆయన అందానికి ఎక్కువగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.
Advertisement
అంతేకాకుండా శోభన్ బాబు హెయిర్ స్టైల్ అంటే అప్పట్లో చాలా ఫేమస్. శోభన్ బాబు రింగ్ అని సెలూన్లలో హెయిర్ కట్ లు చేయించుకునేవారు. ముద్దుగా ఇండస్ట్రీలో ఆయనను సోగ్గాడు అని పిలుచుకునేవారు. అంతటి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ శోభన్ బాబు ఎక్కువ కాలం సినిమాలు చేయలేదు. కేవలం యవ్వనంలో ఉన్నంతకాలం మాత్రమే శోభన్ బాబు సినిమాల్లో నటించారు. తనను ప్రేక్షకులు ఎప్పటికీ సోగ్గాడిగానే గుర్తుంచుకోవాలన్నది ఆయన కోరిక.
Advertisement
అందువల్లే ఆ తర్వాత చాలా సినిమా అవకాశాలు వచ్చినా నటనకు దూరంగా ఉండిపోయారు. మహేశ్ బాబు హీరోగా నటించిన అతడు సినిమాలో నాజర్ పాత్ర కోసం మొదట శోభన్ బాబు గారిని సంప్రదించారు. అయినప్పటికీ ఆయన ఆ పాత్రను రిజెక్ట్ చేశారు. ఇక శోభన్ బాబు క్రమశిక్షణ విషయంలోనూ నంబర్ వన్ అని చెప్పక తప్పదు. ప్రతిరోజు శోభన్ బాబు షూటింగ్ సమయానికి కచ్చితంగా వెళ్లేవారు.
అంతేకాకుండా సినిమాల్లో సంపాదించిన డబ్బులను చాలామంది హీరోలు వృధా చేస్తారు. కానీ శోభన్ బాబు మాత్రం ప్రతి రూపాయి ఆచితూచి ఖర్చు చేసేవారు. సినిమాల్లో సంపాదించిన డబ్బులను శోభన్ బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారు. ఎక్కువగా మద్రాస్ లో ఆయన భూములను కొనుగోలు చేశారు. శోభన్ బాబు సినిమాలు చేస్తున్న సమయంలో వేల ఎకరాలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దాంతో ఆయన ఆస్తుల విలువ ఒకప్పుడే 60 వేల కోట్ల వరకు ఉంటుందని చెప్పుకునేవారు. ఇప్పుడు ఆయన ఆస్తుల విలువ లక్షల కోట్లలో ఉంటుందని సమాచారం. ఇక మురళీమోహన్ లాంటి నటులు సైతం శోభన్ బాబును ఫాలో అయ్యారు. అంతేకాకుండా కొంతమంది హీరోయిన్లు కూడా శోభన్ బాబు సలహాలు తీసుకుని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారు. ఇక ప్రస్తుత స్టార్ హీరోలు చాలా మంది ఆస్తుల కంటే శోభన్ బాబు ఆస్తుల విలువ ఎక్కువ కావడం విశేషం.