Home » Chanakya Niti : భార్యాభర్తల బంధం సాఫీగా సాగాలంటే ఏం చేయాలో తెలుసా..?

Chanakya Niti : భార్యాభర్తల బంధం సాఫీగా సాగాలంటే ఏం చేయాలో తెలుసా..?

by Anji
Ad

ఆచార్య చాణ‌క్య నీతిశాస్త్రం అనే పుస్త‌కంలో ఆర్థిక విష‌యాల గురించి కూడా ప్ర‌స్తావించాడు. భార్య భ‌ర్త‌ల మ‌ధ్య సంబంధాల‌ను బ‌లోపేతం చేయ‌డానికి ముఖ్యంగా చాణ‌క్యుడు నాలుగు ముఖ్య‌మైన విష‌యాల‌ను చెప్పాడు. ఇప్పుడు వాటి గురించి మ‌నం తెలుసుకుందాం.

Advertisement

భార్య భ‌ర్త‌ల మ‌ధ్య సంబంధం బ‌లంగా ఉండాలంటే ప్రేమ ముఖ్య‌మ‌ని చెప్పారు. ఒకరిపై ఒక‌రికీ ప్రేమ ఉన్న‌ప్పుడు వారు చివ‌రి వ‌ర‌కు క‌లిసి ఉంటారు. దాంప‌త్యం మ‌ధ్య ఎప్పుడైతే ప్రేమ చిగురిస్తుందో అప్పుడు బంధం బ‌లంగా ఉంటుంది. ముఖ్యంగా వారి మ‌ధ్య ప్రేమ ఉంటే ఎలాంటి క్లిష్ట ప‌రిస్థితుల‌ను అయినా ఎదుర్కొంటారు.


భార్య భ‌ర్త‌ల మ‌ధ్య సంబంధాన్ని బ‌ట్టి వారి భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి ఉంటుంది. కుటుంబ స‌భ్యులంద‌రికీ కుటుంబంపై బాధ్య‌త ఉండాలి. రిలేష‌న్‌షిప్‌, డెడికేష‌న్ లేక‌పోతే ఆ రిలేష‌న్ షిప్ ఎక్కువ కాలం ఉండ‌దు. వాస్త‌వానికి అంకిత‌భావంతో ఒక‌రికి ఒక‌రు స‌హాయం చేసుకోవ‌డానికి ప్రేరేపిస్తుంది. ఇలా ఉన్న‌ప్పుడు వారిని ఏ శ‌క్తి విడ‌దీయ‌ద‌ని చాణ‌క్య సూచించాడు.

Advertisement

Also Read :  గాడ్ ఫాద‌ర్ విజ‌యం వెన‌క ఉంది ఆ ఒక్క‌రేనా..? ఇంత‌కీ ఆయ‌న ఏం చేశాడు..!

అదేవిధంగా గౌర‌వం కూడా చాలా కీల‌క పాత్ర పోషిస్తుంది. భార్య‌భ‌ర్త‌లు ఒక‌రినొక‌రు గౌర‌వించుకోక‌పోతే ఆ బంధం బ‌ల‌హీన‌మ‌వుతుంది. గొడ‌వ‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంది. అందుకే ఒక‌రికొక‌రు ప్రేమ‌తో పాటు గౌర‌వించుకోవాలని ఆచార్య సూచించారు. ముఖ్యంగా భార్య భ‌ర్త‌ల మ‌ధ్య ఎలాంటి స్వార్థం ఉండ‌కూడ‌దు. భార్య‌భ‌ర్త‌లు ఎప్పుడూ ఒక‌రి గురించి మ‌రొక‌రు ఆలోచించాలి. ముఖ్యంగా ప్రేమ అంకిత‌భావం, గౌర‌వం వంటివి ఉన్న‌ప్పుడే భార్య భ‌ర్త‌ల జీవితం సుఖంగా ఉంటుంద‌ని ఆచార్య చాణ‌క్యుడు వెల్ల‌డించాడు.

Also Read :  హీరో నాని ‘దసరా’కి ఎన్ని కోట్ల బిజినెస్ జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

Visitors Are Also Reading