మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాంతో మెగా అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. ఇక చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా లూసిఫర్ కు రీమేగా తెరకెక్కింది. మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్… ట్రైలర్ విడుదల కాగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక దసరా కానుకగా భారీ అంచనాల నడుమ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అంచనాలను రీచ్ అయిందా …? మెగాస్టార్ మరో హిట్టు ఇచ్చిందా..? అనేది రివ్యూ లో చూద్దాం…
Advertisement
కథ & కథనం :
ఈ సినిమా పూర్తిగా రాజకీయాల చుట్టూ తిరుగుతుంది. కథలో రాష్ట్రంలోని ముఖ్యమంత్రి హఠాన్మరణం చెందుతారు. దాంతో ఆ పార్టీలో ముఖ్య నేతల అసలు రంగులు బయటపడతాయి. ఫండింగ్ పేరుతో పార్టీని… ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం కుమారుడు సీఎం కుర్చీ పై కూర్చుంటాడు. ఈ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి కి అత్యంత సన్నిహితుడు అయిన మెగా పవర్ ఎంట్రీ ఇచ్చి రాష్ట్రాన్ని పార్టీని కాపాడే ప్రయత్నాలు చేస్తాడు. ఇదే గాడ్ ఫాదర్ సినిమా అసలు కథ.
Advertisement
గాడ్ ఫాదర్ సినిమా చిరంజీవి వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సినిమాలో చిరంజీవి అద్భుతంగా నటించారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో చిరు కామెడీ టైమింగ్ మాత్రం మిస్సయింది. అంతేకాకుండా చిరంజీవి ప్రతి సినిమాలో డాన్స్ లతో అదరగొడతాడు. కానీ ఈ సినిమాలో డాన్సులు… జోకులకు దూరంగా ఉన్నాడు. సినిమాలో చిరంజీవి తర్వాత సత్యదేవ్ తన పాత్రతో ఆకట్టుకున్నాడు. నయనతార పాత్ర నిడివి తక్కువగా ఉన్నా… ఆమె నటన, పాత్ర ఆకట్టుకునే విధంగా ఉంది. అదేవిధంగా సల్మాన్ ఖాన్, సునీల్, మురళి శర్మ ఇతర ప్రధాన పాత్రలలో నటించిన వాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు.
విశ్లేషణ :
మలయాళ లూసిఫర్ సినిమాకు గాడ్ ఫాదర్ రీమేక్ గా వచ్చింది. అయినప్పటికీ ఉన్నది ఉన్నట్టుగా తీయకుండా చాలా మార్పులు చేశారు. కేవలం కథ కోర్ మాత్రమే తీసుకుంటూ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఎన్నో మార్పులు చేశారు. అయితే సినిమాలో కామెడీ, రొమాన్స్, డాన్స్ లు లేకపోవడం కొంతమందిని నిరాశపరిచింది. మొత్తానికి పొలిటికల్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.