తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ చెరగని ముద్రవేసుకున్న నటుడు ఎన్టీఆర్. కేవలం ఒకే రకమైన పాత్రలు చేయకుండా ఎన్టీఆర్ పౌరాణిక, జానపద, సాంఘీక చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అంటే పౌరాణిక చిత్రాలకు పెట్టింది పేరు. రాముడు కృష్ణుడు లాంటి పాత్రలు చేయాలంటే ఎన్టీఆర్ తరవతే ఎవరైనా. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. దర్శకులు నిర్మాతలు ఎన్టీఆర్ తో సినిమాలు చేయాలని క్యూలో ఉండేవారు.
ఇవి కూడా చదవండి: ఆదిపురుష్ సినిమాకి హిందీలో ప్రభాస్‌కి వాయిస్ ఇచ్చింది ఎవరో తెలుసా..?
Advertisement
కానీ అలాంటి ఎన్టీఆర్ ఓ సినిమా చేసి మూడు నెలల పాటూ ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఈ సినిమా ఏది..? ఎన్టీఆర్ మూడు నెలలు ఇంటికే ఎందుకు పరిమితం అవ్వాల్సి వచ్చింది. అనే వివరాలు ఇప్పుడు చూద్దాం….ఎన్టీఆర్ కెరీర్ లో వచ్చిన ఫ్లాప్ సినిమాలలో తోడు దొంగలు సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటూ గుమ్మడి కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు యోగానంద్ దర్శకత్వం వహించారు.
Advertisement
ఈ సినిమాను కొత్తగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన నిర్మాత నిర్మించారట. ఆయన అప్పుడప్పుడే సినిమాలను నిర్మించడం మొదలు పెట్టారు. ఇక అనభవం లేకపోవడం ఎన్టీఆర్ పై నమ్మకంతో ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. కానీ భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాకు ముందు ఎన్టీఆర్ కెరీర్ లో చాలా హిట్స్ ఉండటంతో తోడుదొంగలు సినిమాకు కూడా బిజినెస్ భాగానే జరిగింది.
కానీ థియేటర్ లో బొమ్మ బోల్తా కొట్టింది. అంతే కాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరిగా నటించలేదని అందుకే ఫ్లాప్ అయ్యిందని నిర్మాత ప్రచారం మొదలు పెట్టారు. ఆ మాటలు విని ఎన్టీఆర్ కృంగి పోయారు. అంతే కాకుండా వెంటనే ఆఫర్ లు రాకపోవడంతో ఎన్టీఆర్ మూడు నెలల పాటూ సినిమాలకు దూరంగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి: చిరంజీవి కోసం హీరో కృష్ణ అంతటి త్యాగం చేశారా..దీంతో చిరంజీవి జాతకమే మారింది..!!