ఆస్ట్రేలియా వేదికగా ఈ నెలలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ అనేది ప్రారంభం కానుంది. అయితే ఈ ప్రపంచ కప్ కు భారత స్టార్ బౌలర్ బుమ్రా దూరం కావడం అనేది దాదాపుగా ఖాయం అయ్యింది. బుమ్రా వెన్నునొపి గాయంతో ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ కు దూరం అయ్యాడు. ఇక అతని స్థానంలో హైదరాబాద్ బౌలర్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు.
Advertisement
కానీ ప్రపంచ కప్ కు మాత్రం బుమ్రా స్థానంలో షమీని ఎంపిక చేయాలనీ బీసీసీఐ సెలక్టర్లు భావిస్తున్నారు. అయితే షమీ ఇంకా ఫిట్ గా లేకపోవడంతో అతనికి బదులు సౌత్ ఆఫ్రికా సిరీస్ కు సిరాజ్ ను ఎంపిక చేసారు. అయితే షమీ ప్రపంచ కప్ వరకు ఫిట్ గా అవుతాడు అనే నమ్మకం చాలా మందికి ఉంది. అయిన కూడా సిరాజ్ ను ప్రపంచ కప్ కోసం వెళ్లే భారత జట్టుతో ఆస్ట్రేలియా విమానం అనేది ఎక్కించనుంది బీసీసీఐ.
Advertisement
అందుకు కారణం అక్కడ సిరాజ్ నెట్ బౌలర్ గా బాగా పనికివస్తాడు. బుమ్రా లేని లోటులో నెట్స్ లో సిరాజ్ తీరుస్తాడు అని బీసీసీఐ అనుకుంటుంది. అయితే సిరాజ్ తో పాటుగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడే ఉమ్రాన్ మాలిక్ ను కూడా బీసీసీఐ ఆస్ట్రేలియా విమానం అనేది ఎక్కించనుంది. గంటకు 150 కీమీ వేగంతో బౌన్గ్ చేసే ఉమ్రాన్ భారత ఆటగాళ్లకు నెట్స్ లో బాగా పనికివస్తాడు అని బీసీసీఐ అనుకుంటుంది.
ఇవి కూడా చదవండి :