Home » కోహ్లీ, రోహిత్ లను కలిపి అవమానించిన ఐసీసీ..!

కోహ్లీ, రోహిత్ లను కలిపి అవమానించిన ఐసీసీ..!

by Azhar

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు అనేది వాస్తవం. ఇక ఈ జట్టులో అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు. ఎన్నో వేల పరుగులు అనేవి చేసి తమ సత్తాను ఎన్నో ఏళ్లుగా చూపిస్తూ వస్తున్నారు. వారే భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం రోహిత్ శర్మ. కానీ ఐసీసీ మాత్రం రోహిత్, కోహ్లీలను కలిపి అవమానించింది. దాంతో ఫ్యాన్స్ ఐసీసీని ట్రోల్ చేస్తున్నారు.

గత మూడేళ్ళుగా ఫామ్ లో లేని విరాట్ కోహ్లీ గత నెలలో జరిగిన ఆసియా కప్ నుండి మళ్ళీ పరుగుల వరద అనేది పరిస్థి వస్తున్నాడు. ఇక రోహిత్ శర్మ కూడా జట్టుకు కావాల్సిన సమయంలో పరుగులు చేస్తున్నాడు. కానీ వీరిని ఐసీసీ తాజాగా జరగబోయే ప్రపంచ కప్ విషయంలో అవమానించింది. అయితే ఐసీసీ తాజాగా ఈ ఏడాది జరిగే ప్రపంచ కప్ లో టాప్ పర్ఫార్మర్ గా వీరు నిలుస్తారు అని 5 ఆటగాళ్ల పేర్లను విడుదల చేసింది.

అందులో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్.. ఇంగ్లాండ్ ఆటగాడు జొస్ బట్లర్.. శ్రీలంక ప్లేయర్ హాసరంగా.. పాకిస్థాన్ ఆటగాడు మొహ్మద్ రిజ్వాన్ తో పటు ఇండియా బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ఉన్నారు. అయితే ఈ లిట్ లో రోహిత్ గాని కోహ్లీ కానీ లేకపోవడం భారత ఫ్యాన్స్ కు ఆగ్రహం అనేది తెప్పించింది. టోర్నీ ముగిసిన తర్వాత ఐసీసీనే తన తప్పు అనేది తెలుసుకుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

ధోనీ బయోపిక్ రావడానికి ఓ పిల్లోడు కారణమా..?

బుమ్రా ప్రపంచ కప్ ఆడటంపై దాదా రియాక్షన్..!

Visitors Are Also Reading