Home » త‌ల్లి ఇందిరా దేవితో మ‌హేష్ బాబు చిన్న‌ప్పుడు ఇలా ఉండే వాడా..?

త‌ల్లి ఇందిరా దేవితో మ‌హేష్ బాబు చిన్న‌ప్పుడు ఇలా ఉండే వాడా..?

by Anji
Published: Last Updated on
Ad

సాధార‌ణం ఎవ‌రి జీవితంలోనైనా త‌ల్లి స్థానం ఎంతో ప్ర‌త్యేక‌మైంద‌నే చెప్పాలి. త‌ల్లితో బిడ్డ‌ల‌కు ఉండే అనుబంధం ఎంతో ప‌విత్ర‌మైంద‌ని.. ప్రేమ, ఆప్యాయ‌త, అనురాగం వంటివి త‌ల్లికి బిడ్డ‌కు మ‌ధ్య ఆ జ‌న్మాంతం పెరుగుతూనే ఉంటాయి. ఎంతో అపురూపంగా చూసుకునే త‌ల్లికి.. బిడ్డ‌లు పెరిగిన కొద్ది వ‌య‌స్సు మీద ప‌డ‌డం స‌ర్వ‌సాధార‌ణం. ఓ ద‌శ‌లో క‌న్న‌త‌ల్లి దూర‌మైతే ప‌డే బాధ‌ను, పేగు బంధం కోల్పోయిన ఫీలింగ్ మ‌నిషిని ఎంత‌గానో బాధిస్తుంది. ప్ర‌స్తుతం టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మాతృవియోగ వేద‌న‌ను అనుభ‌విస్తున్నాడు. సెప్టెంబ‌ర్ 28న మ‌హేష్ బాబు త‌ల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో క‌న్నుమూశారు.

Advertisement

ఇందిరా దేవి మ‌ర‌ణంతో ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. అయితే.. మ‌హేష్ బాబు చిన్న‌ప్ప‌టి నుంచి త‌ల్లి చాటు బిడ్డ‌లా పెరిగాడు. త‌న త‌ల్లితో మ‌హేష్‌కి ఎన‌లేని జ్ఞాప‌కాలు ముడిప‌డి ఉన్నాయి. కృష్ణ-ఇందిరాదేవి దంప‌తుల‌కు ఇద్ద‌రు మ‌గ‌పిల్ల‌లు. అందులో చిన్న కొడుకు మ‌హేష్ బాబుని త‌ల్లి ఇందిరా దేవి గారాబంగా పెంచింది. మ‌హేష్ ఎక్కువ స‌మ‌యాన్ని త‌న త‌ల్లి ద‌గ్గ‌రే గ‌డిపాడు. త‌ల్లితో పాటు త‌న అమ్మ‌మ్మ‌తో కూడా అనుబంధం ఎక్కువ‌గానే ఉంది. ఇందిరా దేవి పెద్ద‌గా బ‌య‌టికి వ‌చ్చేవారు కాదు. పెద్ద‌గా ఫ్యామిలీ ఫంక్ష‌న్స్‌ల‌లో కూడా క‌నిపించే వారు కాదు.

Advertisement

ముఖ్యంగా ఇందిరా దేవి సినిమా కార్య‌క్రమాల‌కు చాలా దూరంగా ఉండేవారు. ఏదైనా శుభ‌కార్యంలో త‌ప్ప ఎక్క‌డ క‌నిపించే వారు కాదు. ఎక్కువ‌గా త‌న పిల్ల‌ల‌తో స‌మ‌యం స్పెండ్ చేసేవారు. ఇందిరా దేవి ఎక్క‌డికి వెళ్లినా మ‌హేష్ బాబు తోడుగా ఉండేవాడ‌ట‌. ఎంతో ఆప్యాయంగా త‌ల్లిని రిసీవ్ చేసుకొని ద‌గ్గ‌ర ఉండి ఆమెను ప్రేమ‌గా ట్రీట్ చేయడం.. వారిద్ద‌రి ఫోటోలు చూస్తేనే అర్థ‌మ‌వుతోంది. కృష్ణ సినిమా షూటింగ్స్‌ల‌లో క‌నిపించ‌ని ఇందిరా దేవి అప్పుడ‌ప్పుడు కొడుకు మ‌హేష్ బాబు సినిమా షూటింగ్ లో క‌నిపించేవారు. ఎందుకంటే మ‌హేష్‌తో టైమ్ స్పెండ్ చేయ‌డమంటే అంత ఇష్ట‌మ‌న్న‌మాట‌.

Also Read :  ఇందిరా దేవి చివ‌రి రోజుల్లో ఇంత న‌ర‌కం అనుభ‌వించిందా..?

మ‌హేష్‌కి అమ్మంటే ఎన‌లేని ప్రేమ‌. ఈ విష‌యాన్నీ ఎన్నో సార్లు బ‌య‌ట కూడా చెప్పేవాడు. త‌న త‌ల్లి ఎక్క‌డికి వెళ్లినా, ఫ్యామిలీ ఫంక్ష‌న్స్‌ల‌లో కూడా చేయి వ‌ద‌ల‌కుండా వెన్నంటే ఉండేవాడు. త‌న చుట్టూ ఎంద‌రు ఉన్నా అమ్మ‌తోనే ఎక్కువ‌గా ముచ్చ‌ట్లు చెబుతూ న‌వ్వుతూ, న‌వ్విస్తుండేవాడు. ఇక అప్పుడ‌ప్పుడు త‌న త‌ల్లి గురించి స్టేజీపై మాట్లాడుతూ.. త‌న‌కు అమ్మ అంటే దైవంతో స‌మానం అని చెప్పి ఎమోష‌నల్ అవ్వ‌డం ప‌లు సంద‌ర్భాల్లో చూశాం. ఇందిరా దేవి చివ‌రి రోజుల వ‌ర‌కు మ‌హేష్ ఆమె వెన్నంటే ఉన్నాడు. ఇక ఇది ఇలా ఉండ‌గా.. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు చిన్న‌ప్పుడు ఇందిరా దేవితో క‌లిసి ఉన్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Also Read :  మా బాబే..మా బాబే..డైలాగ్ బామ్మ గుర్తుందా.. యుక్త వయసులో ఎంత అందంగా ఉందంటే..?

Visitors Are Also Reading