Home » ఇండియాకే మద్దతు ఇచ్చిన ఐసీసీ..!

ఇండియాకే మద్దతు ఇచ్చిన ఐసీసీ..!

by Azhar
Ad
ఇండియా, ఇంగ్లాడ్ మహిళా జట్ల మధ్య జరిగిన మూడో చివరి వన్డే మ్యాచ్ అనేది వివాదాస్పదంగా ముగిసిన విష్యం తెలిసిందే. ఇందులో ఇంగ్లాండ్ చివరి బ్యాటర్ ను భారత బౌలర్ దీప్తి శర్మ రన్ ఔట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పద్దతిని గతంలో మాన్కడింగ్ అని పిలిచేవారు. కానీ ఈ మధ్యే ఐసీసీ దానిని రన్ ఔట్ గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే ఐసీసీ నియమాల ప్రకారమే దీప్తి ఔట్ చేసిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు, మాజీలు ఇదేదో పెద్ద తప్పు అనే విధంగా కామెంట్స్ చేస్తూ వచ్చారు. దానికి బదులుగా మన ఇండియా మాజీలు కూడా గట్టిగానే రిప్లయ్ అనేది ఇచ్చారు. ఇంగ్ల్నాడ్ ప్లేయర్స్ గతంలో చేసిన తప్పులను అన్నింటిని తీసి ట్విట్టీ వీడియో పోస్టులు వేయడం ప్రారంభించారు. దానితో ఇంగ్లాండ్ వారు సైలెంట్ అయ్యారు.
ఇక ఈ రన్ ఔట్ విషయంలో వచ్చిన వివాదంలో ఐసీసీ ఇబిడియా వైపే నిలిచింది. క్రికెట్ రూల్స్ ను రక్షించే మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ ఈరోజు కీలక ప్రకటన చేసింది. దీప్తి శర్మ చేసిన రన్ ఔట్ లో ఏ తప్పు లేదు అని ప్రకటించింది. ఇది ఐసీసీ నియమాల ప్రకారం సరైనదే అని చెప్పింది. అలాగే ఈ రన్ ఔట్ తప్పు.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని కామెంట్స్ చేసే వారు తప్పు అని ప్రకటించింది మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్.

Advertisement

Visitors Are Also Reading