Ad
పటాస్ అనే కార్యక్రమం ద్వారా ప్రజలలో గుర్తింపు తెచ్చుకున్నా నటి ఫైమా. అయితే ఈ షో అనేది ఆగిపోయిన తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ పటాస్ కంటే ఈ జబర్దస్త్ వల్లే ఫైమా కు ఇంకా ఎక్కువ గుర్తింపు అనేది వచ్చింది. ఇందులో ఫైమా చేసే కామెడీకి చాలా మంది ఫ్యాన్ ఉన్నారు అనేది నిజం. ఇందులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు అనేది తెచ్చుకున్నా ఫైమా ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లినా విషయం తెలిసిందే.
రెండు వరాల కిందట ప్రారంభమైన ఈ షోలో కూడా ఫైమా తన కంటూ ప్రత్యేక గుర్తింపు అనేది తెచ్చుకుంది. అయితే ఇంత పేరు అనేది సంపాదించుకున్న ఫైమా డబ్బు ఎంత సంపాదిస్తుంది అనే అనుమానం అందరికి ఉంది. ఇక ఈ విషయంలో తాజాగా ఫైమా తల్లి కొన్ని కామెంట్స్ చేసింది.
ఫైమా బిగ్ బాస్ లో వెళ్లిన సందర్భంగా ఆమె తల్లి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇక ఇందులో ఆమె మాట్లాడుతూ.. ఫైమా తాము వద్దు అంటున్న ఈ రంగంలోకి వచ్చింది అని చెప్పింది. అలాగే ఫైమా యొక్క సంపాదన గురించి మాట్లాడుతూ.. అబ్బాయి అయితే ఎంత సంపాదిస్తునవ్ అని అడగవచ్చు. కానీ అమ్మాయిని అడగలేము. నేను కూడా ఎప్పుడు ఫైమాను తన సంపాదన గురించి అని అడగలేదు అని తెలివిగా సమాధానం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది అనే చెప్పాలి.
Advertisement