ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగారు. లక్షల్లో అభిమానులను సంపాదించుకున్నారు. చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అదే విధంగా కొన్ని ఫ్లాప్ లు కూడా ఉన్నాయి. అలా మెగాస్టార్ నటించిన లంకేశ్వరుడు సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందకు వచ్చింది. ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు.
Advertisement
అంతే కాకుండా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో వడ్డే రమేష్ నిర్మించారు. నిజానికి లంకేశ్వరుడు సినిమా కంటే ముందు దాసరి తన సినిమా శివరంజనిలో చిరంజీవిని హీరోగా అనుకున్నారు. కానీ అది కొన్ని కారణాల వల్ల కుదరలేదు. కాగా 1988 సంవత్సరం లో నవంబర్ లో లంకేశ్వరుడు సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం కూడా ఎంతో గ్రాండ్ గా జరిగింది.
Advertisement
అప్పటి స్టార్ హీరోలు అయిన శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణలు అతిధులుగా హాజరయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రధను ఎంపిక చేశారు. ఇక షూటింగ్ జరుగుతున్న క్రమంలో మెగాస్టార్ దాసరి మధ్య కొన్ని గొడవలు జరిగాయి. ఇద్దరి మధ్య మనస్పర్దలు గొడవలకు దారి తీశాయి. దాంతో దాసరి ఏకంగా సినిమా నుండి తప్పుకున్నారు. చిరు అప్పుడు స్టార్ గా ఎదగగా దాసరి ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఉన్నారు.
ఇక దాసరి తప్పుకోవడంతో చిరంజీవి దాసరి లేకుండానే మూడు పాటలను చిత్రీకరణ పూర్తిచేశాడు. ఆ తరవాత నిర్మాత వడ్డే రమేష్ ఇద్దరినీ కలిసి సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ఇక ఈ సినిమాను భారీ రేటుకు అమ్మారు. ఇక సినిమా భారీ అంచనాల మధ్యన విడుదలవ్వడం…కథ కథనం సరిగా లేకపోవడంతో మెగాస్టార్ కెరీర్ లో ఫ్లాప్ సినిమాగా నిలిచింది.