సినిమాల్లో నటీనటులతో పాటూ చైల్డ్ ఆర్టిస్ట్ లకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని సినిమాల కథలు అయితే పూర్తిగా చైల్డ్ ఆర్టిస్ట్ ల చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఇక మరికొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ ల నటన మరియు వారి క్యూట్ నెస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించినవాళ్లు ప్రస్తుతం పెద్దవాళ్లు అయిన సంగతి తెలిసిందే. చాలా మంది రీఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో బిజీగా ఉంటే మరికొందరు సినిమాలకు దూరంగా ఉంటూ వేరే కెరీర్ ఆప్షన్ లు చూసుకుంటున్నారు.
Advertisement
కాగా ఆనంద్ సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ కూడా చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆనంద్ సినిమాలో ముద్దుముద్దు మాటలతో తన క్యూట్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ పేరు భకిత. ఆనంద్ సినిమాలో హీరో చుట్టూ భకిత ఆనంద్ ఆనంద్ అంటూ తిరుగుతూ ఉంటుంది. బబ్లీగా కనిపిస్తూ తన క్యూట్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Advertisement
భకిత ఆనంద్ తరవాత మళ్లీ అలాంటి సూపర్ హిట్ సినిమాలో కనిపించలేదు. కానీ ఒక్క సినిమాతోనే భకిత అందరికి గుర్తుండిపోయింది. ఇక ఆనంద్ సినిమా విడుదలై ఇప్పటికి పద్దెనిమిదేళ్లు అవుతోంది. కాగా భకిత కూడా పెరిగి పెద్దదయ్యింది. అయితే చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ ల మాధిరికా భకిత మళ్లీ సినిమాల్లో నటించడం లేదు.
సినిమాలకు పూర్తిగా దూరంగా ఎవరూ ఊహించని పనిచేస్తోంది. అంతే కాకుండా భకిత చేస్తున్న పని ఏంటో తెలుస్తే శబాష్ అనకుండా ఉండలేరు. భకిత ఆడవాళ్ల హక్కుల కోసం…వారి అభివృద్ది కోసం పోరాడుతోంది. స్వచ్చంద సంస్థలో వాలంటీర్ గా చేస్తూ కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తోంది.